Advertisement

  • పుట్టిన రోజు సందర్భంగా అనిల్‌ రావిపూడి పంచుకున్న ముచ్చట్లు

పుట్టిన రోజు సందర్భంగా అనిల్‌ రావిపూడి పంచుకున్న ముచ్చట్లు

By: chandrasekar Mon, 23 Nov 2020 4:16 PM

పుట్టిన రోజు సందర్భంగా అనిల్‌ రావిపూడి పంచుకున్న ముచ్చట్లు


వరుస విజయాలతో దూసుకెళుతున్న అనిల్‌ రావిపూడి తన పుట్టిన రోజు సందర్భంగా ముచ్చటించారు. కుటుంబ విలువల కలబోతగా సినిమాల్ని తెరకెక్కిస్తూ వరుస విజయాల్ని అందుకుంటున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ కెరీర్‌పట్ల చాలా సంతృప్తితో ఉన్నా, హీరోలు, నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మరియు వారందరికి జీవితాంతం రుణపడి ఉంటా అని అన్నారు. నేడు నవంబర్ 23 న అనిల్‌ రావిపూడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ముచ్చట్లివి. ప్రతి సినిమా మరపురాని అనుభవమే తొలి చిత్రం ‘పటాస్‌' నాలోని ప్రతిభను చాటిచెప్పింది. దర్శకుడిని కావాలనే నా కలను నిజం చేసి నన్ను ప్రేక్షకులకు చేరువచేసింది. నాకున్న పరిమితుల్లో ఏ విషయంలో రాజీపడకుండా అత్యున్నతంగా ఆ సినిమాను తెరకెక్కించాను.

ఫిలిం ఇండస్ట్రీ లో పరిస్థితుల్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఎలా సినిమా తీయాలో తొలి అడుగులోనే నేర్చుకున్నా. కొత్త దర్శకుడినైనా నన్ను నమ్మి కల్యాణ్‌రామ్‌ ఆ సినిమా చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా. సినీ ప్రయాణంలో సుప్రీమ్‌, రాజాది గ్రేట్‌, ఎఫ్‌-2, సరిలేరు నీకెవ్వరు..ఇలా ప్రతి విజయం ఎన్నో మరపురాని అనుభూతుల్ని మిగిల్చింది. స్నేహితుడి కోసంవరుసగా ఐదు విజయాల్ని అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రాల్ని నా స్నేహితులంతా పంచ పాండవులని, పంచరత్నాలని ప్రశంసిస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. దర్శకుడిగా ఎదగడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకున్నా. ఇటీవలే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించా. కెరీర్‌ ఆరంభం నుంచి నా వెన్నంటి ఉన్న స్నేహితుడు కృష్ణ.. షైన్‌ స్క్రీన్‌ సాహుగారపాటి, హరీష్‌పెద్దితో కలిసి ‘గాలి సంపత్‌' సినిమా చేస్తున్నాను.

ఆయనతో ఓ మిత్రుడిగా ఆ సినిమాకు క్రియేటివ్‌ సపోర్ట్‌ను అందిస్తున్నా. స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నా. భవిష్యత్తులో కృష్ణ నిర్మించే సినిమాలకు నా సహాయం అందించాలనుకుంటున్నా. డిసెంబర్‌లో ‘ఎఫ్‌-3’ మరియు ‘ఎఫ్‌-2’ నా కెరీర్‌లో గేమ్‌ఛేంజర్‌గా నిలిచింది. దర్శకుడిగా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇండియన్‌ పనోరమకు సెలెక్ట్‌ అయ్యి ఇంటర్నేషనల్‌ అవార్డుల్లో ఉత్తమ సినిమాగా నిలిచింది. బెస్ట్‌ డైరెక్టర్‌గా నాకు అవార్డు వచ్చింది. దర్శకుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం ‘ఎఫ్‌-3’ చేయబోతున్నా. డిసెంబర్‌ 14 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌కు ఆదనంగా మరో ఎఫ్‌ జత కలవబోతుంది. అదేమిటో తెరపై చూస్తునే బాగుంటుంది. కరోనా మహమ్మారితో ఒత్తిడిలో పడిన ప్రేక్షకుల్ని మనస్ఫూర్తిగా నవ్వించే సినిమా ఇది.

హీరో మహేష్‌బాబు పిలిస్తే ఆయనతో ఎప్పుడైనా సినిమా చేయడానికి సిద్ధమే. ఆయన ఓకే అంటే తప్పకుండా మరో సినిమా చేస్తా. కొత్త కథలకు సంబంధించి చాలా ఐడియాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేయకుండా ఒకదాని తర్వాత మరొకటి ప్లాన్‌ చేసుకుంటూ వెళుతున్నా. దర్శకత్వంతో పాటు నిర్మాణం కొనసాగించాలనుకుంటున్నా. సినిమానే స్వర్గంఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో పెద్ద విజయాన్ని అందుకున్నా. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక రోజునే నాకు కొడుకు పుట్టాడు. పుత్రోత్సాహంతో ఈ పుట్టినరోజును జరుపుకుంటున్నా. సినిమాల్లోకి వచ్చినందుకు ఏ రోజు బాధపడాల్సిన అవసరం రాలేదు. చేసిన సినిమాలు, సాధించిన విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నా. సినిమానే నన్ను ఇంతవరకు నడిపించింది. ఇదే నాకు స్వర్గం. సెట్స్‌లో ఉన్న ప్రతిక్షణం నేను స్వర్గంలో ఉన్నట్లుగానే ఫీలవుతా అంటూ తన మనసులోని మాటలను పంచుకున్నారు.

Tags :

Advertisement