Advertisement

  • 'ఏకే వెర్సస్ ఏకే' చిత్రం సన్నివేశాల కోసం ఐఏఎఫ్‌కు అనిల్‌కపూర్ క్షమాపణ

'ఏకే వెర్సస్ ఏకే' చిత్రం సన్నివేశాల కోసం ఐఏఎఫ్‌కు అనిల్‌కపూర్ క్షమాపణ

By: chandrasekar Wed, 09 Dec 2020 11:25 PM

'ఏకే వెర్సస్ ఏకే' చిత్రం సన్నివేశాల కోసం ఐఏఎఫ్‌కు అనిల్‌కపూర్ క్షమాపణ


అనిల్‌కపూర్ నటించిన చిత్ర సన్నివేశం పై ఐఏఎఫ్ అభ్యన్తరం తెలపడంతో వారికి అయన క్షమాపణలు తెలిపారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ 'ఏకే వెర్సస్ ఏకే' చిత్రం సన్నివేశాలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు క్షమాపణ చెప్పారు. సినిమాలో ఆయన ఐఏఎఫ్ యూనిఫాం ధరించి అనుచితమైన సంభాషణలు చేశారంటూ ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎఫ్‌లో ఉండే వారి ప్రవర్తన మరియు పరిభాషకు తగ్గట్టుగా ఆయన సంభాషణలు లేవంటూ ఆ సన్నివేశాలను తొలగించాలంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఇదే నెలలో విడుదల కావలసి ఉంది. ఇందుకు సంబంధించిన ఇటీవల విడుదలైన ట్రయిలర్‌‌‌ను వీక్షించిన ఐఏఎఫ్ తాజాగా ట్వీట్‌ చేసింది. దీనిపై అనిల్‌ కపూర్ వెంటనే స్పందించి క్షమాపణ తెలిపారు. ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం నాకు లేదు. కావాలని చేసింది కూడా కాదు. జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను అంటూ అనిల్‌కపూర్ ఇందుకోసం ట్వీట్ చేశారు. తాను క్షమాపణ చెబుతున్న వీడియోను కూడా దీనికి జత చేశారు. ఒక నటుడిగానే తాను సినిమాలో యూనిఫాం వేసుకున్నానని, ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేశానని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో తన కుమార్తె కిడ్నాప్‌కు గురవుతుందని, ఆ కోపం, కూతురు కనబడటం లేదన్న ఆక్రోశం పాత్రలో, సంభాషణల్లో ఉంటుందని తెలిపారు. పాత్రపరంగా అలా నటించానే కానీ, తనకు కానీ, దర్శకుడికి కానీ ఐఏఎఫ్ పట్ల ఎలాంటి అగౌరవం లేదని తెలిపారు. ఐఏఎఫ్ నిస్వార్థ సేవలను తాను ఎప్పుడూ గుర్తు చేసుకుంటానని అయన వివరించారు. ఎవరి మనోభావాలను గాయపరచాలనే ఉద్దేశం తనకు లేదని అయన వివరణ ఇచ్చారు. ఏకే వెర్సస్ ఏకే చిత్రానికి విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు. ఫిల్మ్‌మేకర్ అనురాగర్ కశ్యప్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు. ఇది మంచి విజయాన్ని సాదిస్తుందని తెలిపారు.

Tags :
|

Advertisement