Advertisement

  • 500 వికెట్లకు ఒక్క వికెట్ దూరంలో ఉన్న బ్రాడ్ పై ప్రశంసల వర్షం కురిపించిన స్ట్రాస్..

500 వికెట్లకు ఒక్క వికెట్ దూరంలో ఉన్న బ్రాడ్ పై ప్రశంసల వర్షం కురిపించిన స్ట్రాస్..

By: Sankar Tue, 28 July 2020 12:47 PM

500 వికెట్లకు ఒక్క వికెట్ దూరంలో ఉన్న బ్రాడ్ పై ప్రశంసల వర్షం కురిపించిన స్ట్రాస్..



టెస్టు క్రికెట్‌ చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ స్ట్రాస్‌ ప్రశంసలు వర్షం కురిపించాడు. వెసిండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయిన బ్రాడ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. సుదీర్ఘకాలంగా మరో పేసర్‌ అండర్సన్‌తో కలిసి పేస్‌ విభాగాన్ని పంచుకుంటున్న బ్రాడ్‌ను ఇంతకంటే గొప్ప ఫామ్‌లో చూసిన దాఖలాలు లేవన్నాడు.

విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన బ్రాడ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు. తద్వారా 499 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇప్పటికే ఐదు వందల వికెట్ల క్లబ్‌లో ఉన్న అండర్సన్‌ సరసన చేరడానికి బ్రాడ్‌ వికెట్‌ దూరంలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో అండర్సన్‌-బ్రాడ్‌లపై స్ట్రాస్‌ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో స్థానం సంపాదించారంటూ కొనియాడాడు. సోమవారం వెస్టిండీస్- ఇంగ్లండ్ సిరీస్ ముగింపులో నాల్గవ రోజు రోజు ఆట వర్షార్పణం అయిన తర్వాత స్ట్రాస్‌ మాట్లాడాడు. గతంలో మణికట్టు గాయంతో బాధపడ్డ బ్రాడ్ .. తిరిగి గాడిలో పడటానికి చాలా శ్రమించాడన్నాడు. ముఖ్యంగా కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్‌ చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని బ్రాడ్‌ అధిగమించాడన్నాడు.

కాగా వెస్ట్ ఇండీస్ తో జరిగిన తొలి టెస్టులో బ్రాడ్ కు స్థానం దక్కలేదు ..తాత్కాలిక కెప్టెన్ స్టోక్స్ బ్రాడ్ స్థానంలో ఆర్చర్ కు జట్టులో స్థానంలో కల్పించాడు ..దీనితో బ్రాడ్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి ..ఆ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో బ్రాడ్ ఉంటె గెలిచేవారని చాల మంది మాజీలు విమర్శలు గుప్పించారు ..దీనితో రెండు , మూడో టెస్టుల్లో జట్టులో స్థానం సంపాదించినా బ్రాడ్ సంచలన ప్రదర్శనతో ఇంగ్లాండ్ కు సిరీస్ విజయాన్ని ఖాయం చేసాడు ..

Tags :

Advertisement