Advertisement

  • వివిధ రకాలైన ఫీజుల్ని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్టు

వివిధ రకాలైన ఫీజుల్ని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్టు

By: chandrasekar Mon, 14 Dec 2020 10:43 PM

వివిధ రకాలైన ఫీజుల్ని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్టు


ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్టు కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ ఏడాది అడ్మిషన్ సహా బోర్డు పరిధిలోని వివిధ రకాలైన ఫీజుల్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. రీ అడ్మిషన్, మీడియంలేదా గ్రూప్ మార్పుకు సంబంధించి ఫీజును రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

ప్రభుత్వం వీటికి సంబంధించిన ఫీజుల్ని ఇకపై వసూలు చేయకూడదని ఉత్తర్వులు జారీ చేయడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజుల రద్దు నేపధ్యంలో రీ అడ్మిషన్ కోసమైనా లేదా తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు నుంచి తెలుగు మీడియంలోకి మారాలన్నా లేదా గ్రూప్ మార్చుకోవాలన్నా ఇకపై ఈ ఏడాదికి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు

కరోనా కారణంగా ప్రభుత్వం ఇప్పటికే రాయితీలను ఇస్తూనే ఉంది. దీంతోపాటు ఇంటర్ విద్యార్ధుల సౌకర్యార్ధం ఫీజుల్ని రద్దు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్టు తెలిపింది.

Tags :
|

Advertisement