Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్: 12% వడ్డీ కలిపి వేతన బకాయిలు చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్: 12% వడ్డీ కలిపి వేతన బకాయిలు చెల్లించాలి

By: chandrasekar Wed, 12 Aug 2020 11:08 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్: 12% వడ్డీ కలిపి వేతన బకాయిలు చెల్లించాలి


కరోనా వైరస్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. విశాఖపట్నంకు చెందిన రిటైర్ట్ న్యాయమూర్తి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు కోత విధించిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. వేతన బకాయిలకు 12 శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement