Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా నమోదు

By: chandrasekar Sat, 12 Sept 2020 12:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా నమోదు


ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల వ్యవధిలో 9999 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 547686కి పెరిగింది. అలాగే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 77 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4779కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలోని కడప జిల్లాలో 9, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 8, గుంటూరు 7, కృష్ణా 7, అనంతపురం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 3, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇక ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1499 కరోనా కేసులు నమోదయ్యాయి.

పశ్చిమ గోదావరి 1081, చిత్తూరు 1040, గుంటూరు 920, ప్రకాశం 901, నెల్లూరు 778, కడప 698, విజయనగరం 594, శ్రీకాకుళం 570, అనంతపురం 557, కర్నూలు 497, కృష్ణా 451, విశాఖపట్నం 413 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 547686 కాగా, 446716 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 96191. ఇప్పటి వరకు కరోనా కారణంగా 4779 మంది చనిపోయారు. అలాగే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,137 కరోనా టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 11,069 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 44,52,128 కరోనా శాంపిల్స్ టెస్టు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Tags :
|

Advertisement