Advertisement

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలకు ఆన్‌లైన్‌ ప్రక్రియతో ముక్కుతాడు...?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలకు ఆన్‌లైన్‌ ప్రక్రియతో ముక్కుతాడు...?

By: chandrasekar Wed, 28 Oct 2020 11:16 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలకు ఆన్‌లైన్‌ ప్రక్రియతో ముక్కుతాడు...?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యావైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ప్రక్రియతో ముక్కుతాడు వేయనుంది. ఇంటర్మీడియట్ , డిగ్రీ ప్రవేశాల్లో ప్రారంభమైన ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఫలితాలు కన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చాలాకాలంగా కార్పొరేట్‌ విద్యాసంస్థల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్ వస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌ విద్యలో ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఇది సాద్యం కానుంది. ఇప్పటివరకూ తగిన అనుమతులు, సదుపాయాల్లేకుండానే కళాశాల్ని నిర్వహిస్తూ...భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలకు ఇక కష్టకాలమే. ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు అనుమతులు, అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియెట్‌ బోర్డు పర్యవేక్షణలో నిర్వహిస్తోంది.

ప్రైవేటు కళాశాలల్లో మౌళిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం, జీతాలు, ఫీజుల్ని పాఠశాల విద్య పర్యవేక్షణ కమీషన్ నిర్ణయిస్తుంది. వీటికి సంబంధించిన అనుమతులు, బిల్డింగ్ ఫొటోలకు జియోట్యాగింగ్‌, ల్యాబ్‌లు, లైబ్రరీలు, వంటి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచడాన్ని ఇంటర్ బోర్డు పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ కోర్సులు అందించే కాలేజీలు 3 వేల 158 ఉండగా..ఇందులో 1150 కళాశాలు ప్రభుత్వానివి కాగా..మిగిలినవి ప్రైవేటువే. ముఖ్యంగా నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ సంస్థల కాలేజీలు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా..మిగిలిన కళాశాలలతో బినామీగా వ్యవహారం నడుపుతున్నాయనే ఆరోపణలున్నాయి.ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపులకు కలిపి సెక్షన్ కు 88 మంది విద్యార్థులను చేర్చుకోవాలని నిబంధనలుంటే..ఇందుకు భిన్నంగా గ్రూపుకు 88 మందిని చేర్చుకుంటున్నాయి.

ఇప్పుడు ఒక్కో సెక్షన్ గ్రూపుకు 40 మంది వరకే అనుమతి. కనిష్టంగా 4 సెక్షన్లు, గరిష్టంగా 9 వరకూ అనుమతి ఉంటుంది. కేవలం ఎంపీసీ ( MPC ) , బైపీసీ ( BiPC ) లే కాకుండా మిగిలిన గ్రూపుల్ని కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులతో పాటు భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌ల జియో ట్యాగింగ్‌ ఫోటోలు అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి. టీచింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది అర్హతలు, వేతనాలు , విద్యార్ధుల ఫీజల్ని డాక్యుమెంట్లతో సహా ఇంటర్ బోర్డుకు సమర్పించాలి. కళాశాలల్లోని మొత్తం సీట్లలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వివిధ కులాల రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది. ఆ రిజర్వేషన్ల ప్రకారం తప్పనిసరిగా సీట్లు కేటాయించాలి. కాలేజీల కోసం అనుమతి పొంది..ఇతర కోచింగ్ క్లాసులు నిర్వహించకుండా నిబంధనలు పగడ్బందీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆన్‌లైన్‌ అనుమతులు, అడ్మిషన్ల ప్రక్రియను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ bie.ap.gov.in ద్వారా చేపడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా అనుమతి ఓ ప్రాంతంలో తీసుకుని నిర్వహణ మరో ప్రాంతంలో చేయడం, రెండు మూడు కాలేజీలకు చెందిన విద్యార్ధుల్ని ఒకే గదిలో బోధించడం ప్రస్తుతం సాధారణంగా మారింది. ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయనుంది.

Tags :

Advertisement