Advertisement

  • ఆంధ్రప్రదేశ్ మళ్లీ స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు...

ఆంధ్రప్రదేశ్ మళ్లీ స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు...

By: chandrasekar Sat, 07 Nov 2020 12:00 PM

ఆంధ్రప్రదేశ్ మళ్లీ స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు...


కరోనా వైరస్ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ స్వల్పంగా తగ్గాయి. అలాగే కరోనా వైరస్ మరణాలు కూడా తగ్గాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గించడంతో కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 79,601 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,410 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 8,38,363కి చేరుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం కరోనా బారినపడి 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,768కు చేరుకుంది.

కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, కడపలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాత పడ్డారు. అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు పెరిగాయి. శుక్రవారం 2,452 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,38,363 పాజిటివ్ కేసులకు గాను.. 8,09,770 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 21,825 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లావ్యాప్తంగా 401 కేసులు నమోదయ్యాయి. అలాగే తూర్పు గోదావరిలో మొత్తంగా 1,18,015 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement