Advertisement

  • ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కొత్త కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కొత్త కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు సోము వీర్రాజు

By: chandrasekar Mon, 14 Sept 2020 09:14 AM

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కొత్త కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు సోము వీర్రాజు


ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త కమిటీని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా ముందుకెళ్తున్నారు. తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీలో జోష్ నింపుతున్నారు. తాజాగా, బీజేపీ రాష్ట్ర కొత్త పదాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు 40 మందితో కూడిన కొత్త కమిటీని ప్రకటించారు. 10 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ట్రెజరర్‌, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శితో జాబితా విడుదల చేశారు. కమిటీలో సోము వీర్రాజు తనదైన మార్కు చూపించారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికే కమిటీలో చోటు లభించింది. జంబో కమిటీలకు సోము వీర్రాజు స్వస్తి పలికారు.

గత కమిటీలో బీజేపీకి 30 మంది అధికార ప్రతినిధులు ఉండగా, ఈ జాబితాను 6కు కుదించారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులుగా విష్ణుకుమార్‌రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మి, మాలతీరాణి, నిమ్మల జయరాజు, ఆదినారాయణరెడ్డి, వేణుగోపాల్, రావెల, సురేందర్‌రెడ్డి, చంద్రమౌళి వున్నారు. ప్రధాన కార్యదర్శులుగా పీవీఎన్ మాధవ్, విష్ణువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణ రాజు, మధుకర్, ఎల్ గాంధీ వున్నారు.

అధికార ప్రతినిధులుగా భాను ప్రకాష్‌రెడ్డి, పూడి తిరుపతిరావు, సుహాసిని ఆనంద్, సాంబశివరావు, ఆంజనేయరెడ్డి, ఎస్.శ్రీనివాస్ వున్నారు. ట్రెజరర్‌గా సత్యమూర్తి మరియు ఆఫీస్ సెక్రటరీగా పి.శ్రీనివాస్‌ ఉన్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement