Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడి ఓ జర్నలిస్టు మరణం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడి ఓ జర్నలిస్టు మరణం

By: chandrasekar Mon, 13 July 2020 10:53 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడి ఓ జర్నలిస్టు మరణం


ఏపీ మీడియా రంగంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడి ఓ జర్నలిస్టు ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామంతో తిరుపతిలోని పాత్రికేయులు విషాదంలో మునిగిపోయారు. తిరుపతి నగరంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్‌లో వీడియో జర్నలిస్టుగా చేస్తున్న పార్థసారథి అనే వ్యక్తికి నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స కోసం కరోనా ఆస్పత్రికి వెళ్లారు. ఊపిరి పీల్చుకోలేని ప‌రిస్థితుల్లో మూడు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఆయ‌నకు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయ‌న క‌న్నుమూశారు.

గత ఇరవై ఏళ్లుగా వివిధ చానళ్లలో ఆయన కెమెరామెన్‌గా సేవ‌లందించారు. జర్నలిస్టు పార్థసారథికి సరైన వైద్యం అందించేందుకు అన్ని మీడియా ప్రతినిధులు సాయశక్తుల కృషి చేశారు. సరైన వైద్యం అందించాలని కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్విమ్స్ డైరెక్టర్‌కు వినతులు పంపారు. అయితే ఇంతలోనే ఆయన మృత్యువాత పడ్డారు. వీడియో జర్నలిస్టు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లు జ‌ర్నలిస్ట్ సంఘాలు సంతాపం ప్రక‌టించాయి.



Tags :
|

Advertisement