Advertisement

  • త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్న యాంకర్ ప్రదీప్...?

త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్న యాంకర్ ప్రదీప్...?

By: chandrasekar Thu, 01 Oct 2020 4:54 PM

త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్న యాంకర్ ప్రదీప్...?


బుల్లితెరపై టీవీ యాంకర్ ప్రదీప్ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రదీప్ ఏ షో చేసిన అందులో తోటి యాంకర్లు కానీ, జడ్జిలు కానీ మొదటగా ప్రదీప్‌ని అడిగే ప్రశ్న ' ప్రదీప్.. నీ పెళ్లేప్పుడు' అని. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాదానం దొరికిందని తెలుస్తోంది. బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజుకు పెళ్లి కుదిరిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. రాయలసీమకు చెందిన రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్‌కి పెళ్లి నిశ్చయం అయినట్టు, ఈ ఏడాది చివరిలో ప్రదీప్ వివాహం జరుగబోతుందని సమాచారం. ప్రదీప్ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించనప్పటికి ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో కథనాలు రావడం తొలిసారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలాగే పలానా యాంకర్‌తో ప్రదీప్ పెళ్లి, పలానా నటితో ప్రదీప్ పెళ్లి అంటూ ఎన్నోసార్లు పుకార్లు లేచాయి. కనుక ప్రదీప్ అధికారికంగా స్పందించే వరకు ఏది నిజమో చెప్పడం కష్టమే. గతంలో, ప్రదీప్ పెళ్లి గురించి ఓ టీవీ చానల్‌లో ఏకంగా ఒక ప్రోగ్రామే చేశారు. ఆ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది యువతుల పాల్గొనడం జరిగింది. కాకపొతే ఆ షో ఫ్లాప్ అయింది అది వేరే విషయం అనుకోండి. బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ ప్రదీప్ వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్.. ప్రస్తుతం ఆ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. కరోనావైరస్ కారణంగా థియేటర్‌లు మూతపడడంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదలకు సిద్దమవుతోందని టాక్.

Tags :
|
|
|

Advertisement