Advertisement

  • ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ..

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ..

By: Sankar Fri, 10 July 2020 6:04 PM

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ..



రౌడీ హీరో విజయ్ దేవరకొండ తెలుగు లో ప్రస్తుతం ఉన్న స్టార్ నటులలో ఒకరు ..అయితే అయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో గా ట్రై చేసారు ..తొలి సినిమాగా దొరసాని అనే మూవీలో నటించాడు ..రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది ..ఇప్పుడు ఆనంద్ దేవరకొండ హీరోగా రెండో సినిమా సిద్ధమైంది. ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు..ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుంది.

నిర్మాత వెనిగ‌ళ్ల ఆనంద‌ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సినిమా తొలి కాపీ సిద్ధంగా ఉంది. క‌థ‌కు ప్రాధాన్యమిస్తూ సినిమాలు తీద్దామ‌నుకునే నిర్ణయంలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. గుంటూరు జిల్లా కొల‌క‌లూరు ప్రాంతం, గుంటూరు సిటీ, ప‌రిసర‌ ప్రాంతాల్లో షూటింగు చేశాం. పాత్రల‌న్నీ గుంటూరు యాసలోనే మాట్లాడుతాయి. ఈ వేస‌వికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నాం. కానీ, లాక్‌డౌన్ ప‌రిస్థితుల వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేశాం. త్వర‌లోనే విడుద‌ల తేదీ వివ‌రాల‌ను వెల్లడిస్తాం’’ అని చెప్పారు.

చిత్ర ద‌ర్శకుడు వినోద్ అనంతోజు మాట్లాడుతూ.. ‘‘మామూలు మనుషుల జీవితాలలో ఉండే సున్నితమైన హాస్యాన్ని ఇందులో చూపించాం. ప్రతి ఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా పాత్రలుంటాయి. వాటితో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. ఆనంద్ దేవ‌ర‌కొండ తొలి చిత్రం ‘దొర‌సాని’కి పూర్తి భిన్నంగా ఇందులో ఆయ‌న పాత్ర ఉంటుంది. ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’తో పాటు ప‌లు చిత్రాల‌కు సంగీతం అందించిన స్వీక‌ర్ అగ‌స్తి మా చిత్రానికి మంచి పాట‌లు ఇచ్చారు. మొత్తం ఐదు పాట‌లున్నాయి’’ అని అన్నారు.

Tags :
|
|
|

Advertisement