Advertisement

  • బంగ్లాదేశ్ నుంచి ఉచితంగా కరోనా మందును సమకూర్చిన ఓ అజ్ఞాత వ్యక్తి

బంగ్లాదేశ్ నుంచి ఉచితంగా కరోనా మందును సమకూర్చిన ఓ అజ్ఞాత వ్యక్తి

By: chandrasekar Fri, 26 June 2020 6:30 PM

బంగ్లాదేశ్ నుంచి ఉచితంగా కరోనా మందును సమకూర్చిన ఓ అజ్ఞాత వ్యక్తి


కరోనా పై పోరాటంలో ముందు నిలుస్తున్న సహాయకులకు ధన్యవాదాలు చెప్పేందుకు ఏమి చేసిన చాలదు. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ బారినపడిన రోగులను కాపేందుకు వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై మహానగరానికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి ఇప్పుడు తన ఔదార్యంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.

ఆ వ్యక్తి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది రోగులకు కరోనా వ్యాధికి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్న మందును బంగ్లాదేశ్ నుంచి ఉచితంగా సమకూర్చడమే ఇందుకు కారణం. దీని కోసం ఆ వ్యక్తి రూ.5 లక్షల సొంత డబ్బును వెచ్చించాడు. అంత చేస్తున్నా తన పేరు కూడా బయటకు రావడానికి వీల్లేదంటున్నాడు ఆ వ్యక్తి.

కరోనా రోగుల్లో రెమ్డెసివిర్ మందు బాగా పనిచేస్తున్నట్లు వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. తీవ్ర వ్యాధి లక్షణాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు కూడా ఈ మందు వేసిన తర్వాత కరోనా మహమ్మారిని జయించి తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ముంబై ఆస్పత్రుల్లో ఈ మందు అంత ఈజీగా లభించడం లేదు.

రెమ్డెసివిర్ అందుబాటులో లేకపోవడంతో కొందరు రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇటీవల ఓ రోగి తనకున్న పరపతితో స్వయంగా ఆ మందును బంగ్లాదేశ్ నుంచి సమకూర్చుకున్నాడు. లీలావతి ఆస్పత్రిలో పలువురు కరోనా రోగులకు రెమ్డెసివిర్ మందు దొరక్క ఇబ్బంది పడుతుండటంతో ఓ అజ్ఞాత వ్యక్తి చలించిపోయాడు.

25 మంది రోగులకు ఈ మందును బంగ్లాదేశ్ నుంచి తన సొంత ఖర్చులతో సమకూర్చాడు. పలువురి ప్రాణాలు నిలబెట్టాడు. అయితే తన పేరు, వివరాలను మాత్రం గోప్యంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితిలోనూ బయటకు చెప్పొద్దని లీలావతి ఆస్పత్రి వైద్యులను ఆ వ్యక్తి కోరినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి ఈ మందును ఎలా తెప్పించానన్న విషయంలో పోలీసులు, అధికారులు తనను ఇబ్బందిపెట్టే అవకాశం ఉండటంతో తన వివరాలు గోప్యంగా ఉంచాలని ఆ వ్యక్తి కోరినట్లు హాస్పిటల్ బృందం తెలిపారు.

ఇటీవల సదరు అజ్ఞాత వ్యక్తి తండ్రి కరోనా వైరస్ సోకి చికిత్సా ఫలితం లేకుండా చనిపోయాడు. దీంతో తన తండ్రికి ఏర్పడిన దుస్థితి ఎదుటివారికి రాకూడదన్న పెద్ద మనస్సుతో రూ.5 లక్షలు వెచ్చించి 25 మందికి అవసరమైన రెమ్డెసివిర్ మందును బంగ్లాదేశ్ నుంచి ముంబైకి తెప్పించినట్లు వైద్యులు తెలిపారు. ఈ మందు ద్వారా లబ్ధిపొందిన వారిలో ఇద్దరు డాక్టర్లు, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు.

మందును సమకూర్చే సమంలో రోగి ధనవంతుడా, పేదవాడా, అనే వివరాలేవీ ఆ వ్యక్తి అడగటం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ కరోనా మందును ఎక్కడి నుంచి సమకూర్చుతున్నాడో మాకు తెలీదు. ఇలాంటి గొప్ప మనసున్న వారు కూడా ఉన్నారని తమకు ఇప్పుడే తెలుస్తోందని ఓ వైద్యుడు పేర్కొన్నాడు. ఎబోలా వైరస్‌ను ఎదుర్కొనేందుకు 2014లో రెమ్డెసివిర్ మందును తయారు చేశారు. కరోనా రోగులకు కూడా ఇది బాగా పనిచేస్తుండటంతో దీని జనరిక్ వెర్షన్ తయారీకి హెటెరో, సిప్లా సంస్థలకు డీసీజీఐ ద్వారా ఇటీవలే అనుమతి లభించింది.

Tags :
|

Advertisement