Advertisement

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కోలుకోలేని దెబ్బ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కోలుకోలేని దెబ్బ

By: chandrasekar Tue, 06 Oct 2020 1:14 PM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కోలుకోలేని దెబ్బ


హైదరాబాద్‌ విజయాల్లో కీలక భూమిక పోషించిన బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తుంటి గాయంతో బాధపడుతూ ఐపీఎల్‌ మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ తన చివరి ఓవర్లో గాయపడ్డాడు. దాంతో ఐపీఎల్‌ సీజన్‌ వీడి అతను వెంటనే ఇంటికి బయలుదేరాడు. దాంతో ఆదివారం షార్జాలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు.

"భువనేశ్వర్ ఈ ఏడాది టోర్నమెంట్లో పాల్గొనలేడు. ఎందుకంటే అతను తీవ్రమైన తుంటి గాయంతో బాధపడుతున్నాడు. భువి తొలిగిపోవడం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కోలుకోని దెబ్బ" అని క్రీడాపండితులు ఆంటున్నారు. అంతకుముందు ఆదివారం నాడు కెప్టెన్ డేవిడ్ వార్నర్ భువనేశ్వర్‌ను కొన్ని మ్యాచుల్లో ఆడతాడని తెలిపాడు. అయితే ఇటీవలి పరిణామాలు అతడు మొత్తం సీజన్ నుంచి తప్పినట్లుగా తెలుస్తున్నది. పేస్ అటాక్‌ అంతగా లేని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఈ వార్తలు తీవ్రంగా బాధపెట్టనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మలు ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దాడి ఇప్పుడు పూర్తిగా రషీద్ ఖాన్, నటరాజన్‌పై ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భువనేశ్వర్‌ కుమార్‌ గాయపడటం ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టుకు కూడా ఈ వార్త ఆందోళన కలిగించే విషయమే అని చెప్పవచ్చు.

వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వేలు గాయంతో మిగిలిన సీజన్ నుండి తప్పుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. గత వారం షార్జాలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా తొలి ఓవర్లో నితిష్‌ రాణా క్యాచ్‌ పట్టుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో అమిత్‌ మిశ్రా వేలుకు గాయమైంది. అనంతరం మైదానం వీడి చికిత్స కోసం హోటల్‌ గదికి వెళ్లిపోయాడు.

Tags :
|
|

Advertisement