Advertisement

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్పైనే చికిత్స చేస్తున్నట్లు తెలిపిన ఆర్మీ ఆసుపత్రి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్పైనే చికిత్స చేస్తున్నట్లు తెలిపిన ఆర్మీ ఆసుపత్రి

By: chandrasekar Tue, 18 Aug 2020 7:14 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్పైనే చికిత్స చేస్తున్నట్లు తెలిపిన ఆర్మీ ఆసుపత్రి


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వెంటిలేటర్‌పైనే చికిత్స చేస్తున్నట్లు ఆర్మీ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. కరోనా కారణంగా అయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది మరియు వయసు పై బడడంతో కోలుకోవడంతో మరింత చికిత్స అవసరమవుతుందని తెలిపారు.

కరోనా సోకడంతో పాటు ఆయన మెదడుకు వెళ్లే రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు గడ్డ కట్టిన రక్తమును తీయడానికి ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోందని ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. ఆయన శరీరంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, గుండె పనితీరు వంటివి మాత్రం స్థిరంగానే ఉన్నట్లు తెలిపింది. వయసు అధికంగా ఉండడం వల్ల కూడా అయన కోలుకోవడంతో సమయం తీసుకుంటా ఉందని డాక్టర్లు తెలిపారు.

Tags :

Advertisement