Advertisement

ఒడిశా రాష్ట్రంలో ఓ పురాతన గుడి బయటపడింది

By: chandrasekar Sat, 13 June 2020 12:38 PM

ఒడిశా రాష్ట్రంలో ఓ పురాతన గుడి బయటపడింది


సుమారు 500 ఏండ్ల కింద నీట మునిగిన ఓ పురాతన గుడి ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో బయటపడింది. కటక్‌లోని మహానంది నదీ తీరంలో మునిగిపోయిన పురాతన ఆలయాన్ని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్‌కు చెందిన పురావస్తు సర్వే బృందం ఇటీవల కనుగొన్నది.

పడవలో నది అంతా గాలిస్తూ పలు ప్రయత్నాల తర్వాత దీనిని గుర్తించినట్లు ఆ బృందానికి చెందిన దీపక్‌ కుమార్ నాయక్‌ తెలిపారు. కటక్‌ సమీపంలోని పద్మావతి ప్రాంతంలో బైదేశ్వర్‌ వద్ద నది మధ్యలో ఈ గుడి పై భాగాన్నికనుగొన్నట్లు ఆయన చెప్పారు. 60 అడుగుల ఎత్తున్న ఉన్న ఈ పురాతన ఆలయం 15వ లేదా 16వ శాతాబ్దానికి చెందినగా పేర్కొన్నారు. కాగా 11 ఏండ్ల కిందట వేసవిలో చివరిసారి ఈ గుడి పైభాగం కనిపించినట్లు తెలుస్తున్నది.

Tags :
|
|

Advertisement