Advertisement

అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్...!

By: Anji Wed, 02 Dec 2020 8:40 PM

అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఏపి అమూల్‌ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకాన్ని ప్రారంభించారు.

అనంతరం ఏపి అమూల్‌ వెబ్‌సెట్‌, డ్యాష్‌ బోర్టును సిఎం ఆవిష్కరించారు. తొలి విడతలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 4వందల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. లీటర్‌కు 5 నుంచి 7 రూపాయలు అధిక ఆదాయం పాడిరైతులకు లభిస్తుందని తెలిపారు.

సహకార రంగంలో ఏర్పాటైన అముల్ సంస్థ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోందని అన్నారు. అముల్రావటంతో ఏపిలో పాలసహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చని వ్యాఖ్యానించారు.

దశలవారీగా 6,551కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సిఎం జగన్ తెలిపారు.

Tags :
|

Advertisement