Advertisement

  • కరోనా వాక్సిన్ కొవాక్సీన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం

కరోనా వాక్సిన్ కొవాక్సీన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం

By: Sankar Wed, 11 Nov 2020 5:13 PM

కరోనా వాక్సిన్ కొవాక్సీన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం


కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే కరోనా వ్యాక్సిన్ రావాలి. ప్రస్తుతం దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ లు రెడీ అవుతున్నాయి. ఈ మూడు వివిధ దశల్లో ట్రయల్స్ లో ఉన్నాయి.

భారత్ బయోటెక్, ఐసిఎంఆర్ సంయుక్తంగా డెవలప్ చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెండు దశల ట్రయల్స్ ను ఇప్పటికే పూర్తి చేసింది. మూడో దశ ట్రయల్స్ ను త్వరలోనే నిర్వహించబోతున్నారు. దేశంలోని 25 లొకేషన్స్ లో 26 వేలమందిపై మూడోదశ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. దీనికోసం వాలంటీర్ల రిక్రూట్మెంట్ జరుగుతున్నది.

లక్నోలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ ట్రయల్స్ లో తొలి వాలంటీర్ గా పేరు నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని అయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మొదటి రెండు దశల్లో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇచ్చిన సంగతి తెలిసిందే

Tags :
|
|

Advertisement