Advertisement

  • నా జీవితం నన్ను ఇలా బతకనివ్వు వర్మ ..అమృత ప్రణయ్

నా జీవితం నన్ను ఇలా బతకనివ్వు వర్మ ..అమృత ప్రణయ్

By: Sankar Mon, 22 June 2020 11:34 AM

నా జీవితం నన్ను ఇలా బతకనివ్వు వర్మ ..అమృత ప్రణయ్



రాంగోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే ..వర్మకు సాధ్యం కానిది ఏది లేదు ..కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం కొట్టుమిట్టాడుతుంటే వర్మ మాత్రం తనకు మాత్రమే సాధ్యం అయిన రీతిలో సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు ..మొన్నటికి మొన్న మియా మాల్కోవా తో క్లైమాక్స్ అనే మూవీ తీసి డిజిటల్ ప్లాట్ఫారం లో విడుదల చేస్తే వచ్చిన కలెక్షన్స్ చూసి వర్మకే మైండ్ బ్లాక్ అయింది ..ఇక ఆ తర్వాత కరోనా వైరస్ మీద సినిమా అంటూ ట్రైలర్ విడుదల చేసి జనాలకు కరోనా వైరస్ అంటే దడ పుట్టెల చేసాడు ..ఇక యువతనే లక్ష్యంగా చేసుకోని నేకేడ్ అనే మూవీ ట్రైలర్ ను విడుదల చేసాడు ..ఈ ట్రైలర్ చుసిన జనాలు వర్మ పెట్టిన కెమెరా యాంగిల్స్ చూసి ముక్కున వేలు వేసుకున్నారు ..

ఇక తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తెలంగాణ లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యా ఉదంతాన్ని ప్రధాన అంశంగా తీసుకోని , మర్డర్ అనే సినిమా తీస్తున్నట్లు ఒక పోస్టర్ను రిలీజ్ చేసాడు దానికి కింద కాప్షన్ ఒక కుటుంబ కథ చిత్రం అని పెట్టాడు ..ఈ పోస్టర్ చుసిన ప్రణయి భార్య అమృత షాక్ కు గురి అయింది ..ఈ పోస్టర్ చుసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అని అమృత తెలిపింది ..ఇప్పటికే ప్రాణంగా ప్రేమిచిన భర్తను కోల్పోయి అనేక బాధల్లో బతుకుతున్న నన్ను ఈ సినిమాతో మరింత రోడ్ మీదకు లాగే ప్రయత్నం వర్మ చేస్తున్నాడని అమృత వాపోయింది ..నా గురించి న సన్నిహితులకు మాత్రమే తెలుసు , పరువు కోసం నా తండ్రి , మ్నా భర్తను కిరాయి గుండాలతో హత్యా చేయించాడు ..ఆత్మ గౌరవంతో ఎదో అలా కాలం వెల్లదీస్తున్న అయితే వర్మ రూపంలో నాకు మరో కష్టం వచ్చిపడింది..

అయితే ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు , ఏడుద్దామన కన్నీళ్లు రావడం లేదు , నా హృదయం బండరాయి అయిపోయింది..దయచేసి నాజీవితాన్ని బజారులో పెట్టొద్దు ..నా కొడుకును చూసుకుంటూ ఉన్నంతలో బతుకుతున్నాను , వర్మ వల్ల నాజీవితంపై సమాజం కళ్ళు పడేలా అయింది అని అమృత వాపోయారు ...పోస్టర్ చుసిన తర్వాత అమృత మాట్లాడుతూ , నువ్వు విడుదల చేసిన పోస్టర్ చూసాను , అందులో నా జీవితానికి ఎక్కడ పోలికలు లేవు , కేవలం మా పేర్లను ఉపయోగించి నీలాంటి ప్రముఖ దర్శకుడు డాబు చేసుకోవాలని చూడటం నిజంగా విచారకరం , నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది అని వర్మను ఉద్దేశించి అమృత అన్నారు

Tags :
|
|
|

Advertisement