Advertisement

బంగ్లాదేశ్‌ లో అంఫన్ ‌తుపాను బీభత్సం

By: chandrasekar Sat, 23 May 2020 12:22 PM

బంగ్లాదేశ్‌ లో అంఫన్ ‌తుపాను బీభత్సం


పదిమంది మృతి, తీరగ్రామాలు ధ్వంసం అనేక ప్రాంతాలు మునక, కూలిన వందల ఇళ్ళు. అంఫన్‌ పెనుతుఫాను బంగ్లాదేశ్‌ను కకావికలం చేసింది. ఇంతవరకు కనీసం 10మంది చనిపోగా కోస్తాతీర ప్రాంత గ్రామాలు ధ్వంసమ య్యాయి. అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వందల ఇళ్ళు నాశనమయ్యాయి. గురువారం ఈ అంశాలను అధికారికంగా ప్రకటించారు. రెండు దశాబ్దాల కాలంలో ఇంత భారీ తుఫాను బీభత్సం తాజాగా చోటు చేసుకున్నది. బుధవారం సాయం కాలం తుపాను తీరం దాటింది. 2007లో సంభవిం చిన సిదర్‌ తుపాను కంటే ఇది శక్తివంతమైనది. ఆనాడు 3,500మంది మరణించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం 10మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది. గోడలు పడిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి సంఘటనల ప్రాథమిక సమాచారమే అందింది. కనిపించకుండా పోయిన తుఫాను సంసిద్ధత కార్యక్రమ సంస్థ నాయకుడు షా ఆలం తొమ్మిది గంటల తరువాత కనబడినట్లు సంబంధిత అధికారి అబు హసనత్‌ తెలిపారు. ఆయన ప్రయాణిస్తున్న బోటు కాలువలో తిరగబడటం కారణంగా ప్రమాదంలో ఆయన చిక్కుకుపో యారు. తుపాను సహాయ కార్యక్రమాలలో పాల్గొనే వాలంటీర్లతో పాటు అలంకూడా హఫెజ్‌ కాలువలో ప్రయాణిస్తుండగా బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది.


amphen,creates,heavy,loss,bangladesh ,బంగ్లాదేశ్‌, అంఫన్, తుపాను, బీభత్సం, తీరగ్రామాలు


ఈశాన్య ప్రాంతంవైపు తుపాను ప్రయాణించి నెమ్మదిగా బలహీనపడుతుందని వాతావరణ పరిశోధన శాఖ తెలిపింది. నీట మునిగి అరవైయేళ్ళ బర్గుణ చనిపోయాడు. కూలిన చెట్టు మీదపడటంతో 40ఏళ్ళ మహిళ మృతి చెందారు. అలాగే గోడకూలి మరో 60ఏళ్ళ వ్యక్తి మరణించారు. ఇలా వివిధ రకాల ప్రమాదాల్లోనే పదిమంది మృతిచెందారు. తుపాను ప్రభావానికి గురవుతారన్న భావించిన 20లక్షలమందిని తాత్కాలిక షెల్టర్లతో తరలించారు. గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సమయాల్లో 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.

Tags :
|
|
|

Advertisement