Advertisement

  • అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్ టెస్టులో నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్ టెస్టులో నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

By: chandrasekar Mon, 03 Aug 2020 09:26 AM

అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్ టెస్టులో నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్


కరోనా పాజిటివ్ కారణంగా చికిత్సకోసం హాస్పిటల్‌లో చేరిన అమితాబ్ బచ్చన్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్ బచ్చన్ గత మూడు వారాలుగా ముంబై నానావతి హాస్పిటల్‌లోనే కరోనాకి చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన తరువాత ఇక్కడే చికిత్స తీసికుంటున్నారు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ గా వచ్చింది.

కానీ ఇప్పటికే మనవరాలు మరియు కోడలు ఐశ్వర్యకు కరోనా నయం అయిపోయింది. ఇప్పటికీ సీనియర్ మరియు జూనియర్ బచ్చన్ మాత్రం హాస్పిటల్‌లోనే ఉన్నారు. దాంతో అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో అభిషేక్ బచ్చన్ పండగ లాంటి వార్త చెప్పారు. తాజాగా చేసిన టెస్టులో అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని ఆయన్ని డిశ్చార్జ్ చేసారని తెలిపారు.

ఇకపై ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటారని ట్వీట్ ద్వారా అభిషేక్ బచ్చన్ తెలిపారు. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేసాడు అభిషేక్ బచ్చన్. అయితే తన ఆరోగ్యం విషయంపై మాత్రం అభిషేక్ బచ్చన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈయన కూడా కరోనా బారిన పడ్డాడు. మొత్తానికి అమితాబ్ కోలుకుని ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఇక మిగిలిన అభిషేక్ బచ్చన్ కు ఎప్పుడు నెగటివ్ రిజల్ట్స్ వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags :

Advertisement