Advertisement

  • బిగ్ బి ఫ్యామిలీలో కరోనా కలకలం.. తండ్రీకొడుకులు కరోనా పాజిటివ్ నిర్దారణ ..

బిగ్ బి ఫ్యామిలీలో కరోనా కలకలం.. తండ్రీకొడుకులు కరోనా పాజిటివ్ నిర్దారణ ..

By: Sankar Sun, 12 July 2020 08:04 AM

బిగ్ బి ఫ్యామిలీలో కరోనా కలకలం.. తండ్రీకొడుకులు కరోనా పాజిటివ్ నిర్దారణ ..



బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కూ కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే అభిషేక్ బచ్చన్ సైతం తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు.

అమితాబ్ బచ్చన్ రాత్రి 10 గంటల తర్వాత ఆస్పత్రికి వచ్చారని, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని నానావతి ఆస్పత్రి డాక్టర్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. బిగ్ బీ ప్రకటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన ప్రకటన చేసిన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

కాగా అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేసిన కొంచెం సేపటికే అయన కొడుకు అభిషేక్ బచ్చన్ తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించాడు ..మా తండ్రి, నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇద్దరికీ కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ ఈ సమాచారాన్ని అందించాం. అలాగే మా కుటుంబ సభ్యులు, స్టాఫ్‌కు సైతం కరోనా పరీక్షలు చేయించాం. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు.

కాగా, అమితాబ్ ఫ్యామిలీలో మరి కొందరికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అమితాబ్ సతీమణి జయా బచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యారాయ్, కుమార్తె‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది..బాలీవుడ్ బిగ్ బి ఫామిలీ లో కరోనా కలకలం రేపడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు ..

Tags :
|

Advertisement