Advertisement

  • తన మిస్టేక్‌కు సారీ చెబుతూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేసిన అమితాబ్

తన మిస్టేక్‌కు సారీ చెబుతూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేసిన అమితాబ్

By: chandrasekar Fri, 07 Aug 2020 11:56 AM

తన మిస్టేక్‌కు సారీ చెబుతూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేసిన అమితాబ్


తాను చేసిన ఓ తప్పు పనికి అభిమానులకు క్షమాపణలు కోరాడు బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్. బిగ్‌బీ గత కొన్ని రోజులుగా క్రితం కరోనా బారిన పడ్డారు. అమితాబ్‌తో పాటు ఆయన కొడుకు అభిషేక్, ఐశ్వర్యా రాయ్,మనవరాలు ఆరాధ్యకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అమితాబ్‌ కంటే ముందు ఆయన మనవరాలు ఆరాధ్య, కోడలు ఐశ్వర్యారాయ్ కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నారు.

ఈ మధ్యనే బిగ్‌బీ కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరారు. ప్రస్తుతం ఈయన ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటూ తన తండ్రికి ప్రముఖ కవి హరివంశ రాయ్ బచ్చన్ రాసిన కవితలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బుధవారం రాత్రి ‘అకెలెపాన్ కాబాల్’ అనే కవితను షేర్ చేసి అది తన తండ్రి హరివంశ రాయ్ రాసాడని చెప్పుకొచ్చారు. కానీ ఈ గేయాన్ని బిగ్‌బీ ఫాదర్ హరివంశరాయ్ కాకుండా ప్రముఖ గేయ రచయిత ప్రసూన్ జోషీ రాశారు. తాను చేసిన ఈ తప్పిదాన్ని తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ వెంటనే ఈ రోజు క్షమాపణలు కోరారు.

నిన్న రాత్రి నేను పంచుకున్న పద్యం మా నాన్నగారు రాసింది కాదు. అది ప్రసూన్ జోషి రాసినది అంటూ తన మిస్టేక్‌కు సారీ చెబుతూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు. బిగ్‌బీ ఫాదర్ హరివంశ రాయ్ బచ్చన్ విషయానికొస్తే ఈయన ప్రముఖ కవి. అమితాబ్ బచ్చన్ తండ్రి రాసిన ‘అగ్నిపథ్’, ‘ఆలాప్’, ‘సిల్సిలా’ పేరుతో వచ్చిన రచనలతో బిగ్‌బీ చేసిన సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రసూన్ జోషీ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈయన ‘భాగ్ మిల్కా భాగ్’, ‘చిట్టగ్యాంగ్’, ‘తారే జమీన్ పర్’ , ‘ఢిల్లీ 6’ వంటి సినిమాలకు కథలను అందించారు. ప్రస్తుతం అమితాబ్ ఇంట్లో ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు.

Tags :
|
|

Advertisement