Advertisement

  • జమ్మూ కాశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన అమిత్ షా

జమ్మూ కాశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన అమిత్ షా

By: Sankar Wed, 23 Dec 2020 8:17 PM

జమ్మూ కాశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన అమిత్ షా


జమ్మూక‌శ్మీర్‌లో ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రశంసించారు. డీడీసీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం కట్టబెట్ట‌డంపై జమ్ముకశ్మీర్‌ ప్రజలకు అమిత్‌షా ధన్యవాదాలు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందని రుజువైంద‌న్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అట్ట‌డుగుస్థాయిలో ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించేందుకు మోదీ ప్ర‌భుత్వం అన్ని విధాల కృషి చేస్తునట్లు పేర్కొన్నారు.

డీసీసీ ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్ల‌డ‌య్యాయి. ఫలితాల్లో గుప్కార్‌ కూటమి జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. 110 సీట్లు సాధించిన గుప్కార్ కూట‌మి మొత్తం 13 జిల్లాల్లో ఆధిప‌త్యం కొన‌సాగిచింది. కాగా బీజేపీ 74 సీట్లు సాధించి అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా అవ‌త‌రించింది.

Tags :

Advertisement