Advertisement

  • న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో క‌రోనా వైరస్ కు అమెరికా టీకా

న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో క‌రోనా వైరస్ కు అమెరికా టీకా

By: chandrasekar Sat, 15 Aug 2020 11:03 AM

న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో క‌రోనా వైరస్ కు అమెరికా టీకా


కరోనా కట్టడి కోసం ప్రపంచమంతా వాక్సిన్ తయారీపై తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అమెరికా క‌రోనా వైర‌స్ టీకా కోసం ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్ ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ర‌ష్యా త‌న టీకాను ఆమోదం తెలుపడం ఇప్పుడు దృష్టి అంతా అమెరికాపై నిలిచింది. వైర‌స్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ట్రంప్ స‌ర్కార్ ఆప‌రేష‌న్ వార్ప్‌స్పీడ్‌ను ప్ర‌క‌టించింది. వీలైనంత వేగంగా క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనే టీకాను త‌యారు చేయాల‌ని ఆదేశించారు. అయితే తాజా అంచ‌నాల ప్ర‌కారం అమెరికా టీకా న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను భారీ ఎత్తును ఇంకా నిర్వ‌హించాల్సి ఉంద‌ని అమెరికా వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ ట్ర‌య‌ల్స్ అధికంగా చేయ బడితేనే దాని యొక్క ప్రభావం తెలుస్తుంది.

అమెరికాలోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైర‌క్ట‌ర్ ఫ్రాన్సిస్ కొలిన్స్ దీనిపై స్పందించారు. వ్యాక్సిన్‌ను క‌నీసం ప‌ది వేల మంది ప‌రీక్షిస్తేనే దాని సామ‌ర్థ్యం, భ‌ద్ర‌త లాంటి అంశాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌లే 30 వేల మందిపై వ్యాక్సిన్ ప‌రీక్ష మొదలైన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌యోగాల ఆధారంగా అక్టోబ‌ర్ ఒక‌ట‌వ తేదీ త‌ర్వాత‌నే వ్యాక్సిన్‌పై ఎఫ్‌డీఏ ఏదైనా ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కొలిన్స్ అభిప్రాయ‌ప‌డ్డారు.

అమెరికాలో ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్ కింద సుమారు ఆరు వ్యాక్సిన్లు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఏడాది చివ‌రి క‌ల్లా ఏదైనా రిజ‌ల్ట్ రావ‌చ్చు అని తెలిపారు. అయితే న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆ తేదీ క‌న్నా ముందే వ్యాక్సిన్ రావ‌చ్చు అన్న అభిప్రాయాన్ని ఇటీవ‌ల ట్రంప్ వినిపించారు. అమెరికా తొలి ద‌శ‌లో ఉత్ప‌త్తి చేసే మిలియ‌న్ల సంఖ్య‌లోని టీకాల‌ను ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు, వ్యాధి తీవ్ర‌త ఉన్న‌వారికి ఇవ్వ‌నున్న‌ట్లు కొలిన్స్ తెలిపారు. ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్ కింద అనేక వ్యాక్సిన్లు, ఔష‌ధాలను అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్ర‌భుత్వం ఆర్థిక సాయం చేసిన‌ట్లు తెలిపారు. ఊహించినట్లు వ్యాక్సిన్ తయారైతే అతి త్వరగా కరోనా నుండి కోలుకోవచ్చును.

Tags :
|

Advertisement