Advertisement

  • కరోనా వైరస్ బలహీనతలను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ బలహీనతలను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

By: Sankar Thu, 13 Aug 2020 11:29 AM

కరోనా వైరస్ బలహీనతలను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు



ఒకవైపు కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతూంటే ఇంకోవైపు ఈ మహమ్మారి బలహీనతలేమిటో గుర్తించేందుకూ శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ వైరస్‌ కొమ్ములో ఉండే ఓ లోటును గుర్తించారు.

దీని ఆధారంగా కోవిడ్‌–19కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని అంచనా. మనిషి శరీర కణాల్లోకి ప్రవేశించేందుకు కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ లేదా కొమ్మును వాడుతుందని మనకు తెలుసు. అయితే ఈ ప్రొటీన్‌ కణానికి అంటుకునే ప్రాంతానికి కొన్ని నానోమీటర్ల దూరంలో ఓ చీలిక లాంటిది ఉందని, ధనావేశం కలిగి ఉండే ఈ చీలికకు రుణావేశపు పరమాణువును జోడిస్తే వైరస్‌ కణానికి అతుక్కోవడం నిలిచిపోతుందని తాము గుర్తించినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మోనికా ఒలివేరా డిలా క్రజ్‌ తెలిపారు. వైరస్‌ జన్యుక్రమంలో వచ్చిన మార్పుల కారణంగా వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గిందని కూడా తమ పరిశోధనలు చెబుతున్నాయని వివరించారు..

ఇక కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నపటికీ వాక్సిన్ ప్రయోగాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి..ఇప్పటికే రష్యా తమ వాక్సిన్ ను విడుదల చేయగా , అమెరికా , ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు తయారు చేసిన వాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి ..

Tags :
|
|

Advertisement