Advertisement

  • కరోనాను నివారించడం కోసం ఓ శుభవార్తతో ముందుకొచ్చారు అమెరికా సైంటిస్టులు

కరోనాను నివారించడం కోసం ఓ శుభవార్తతో ముందుకొచ్చారు అమెరికా సైంటిస్టులు

By: chandrasekar Thu, 17 Sept 2020 12:20 PM

కరోనాను నివారించడం కోసం ఓ శుభవార్తతో ముందుకొచ్చారు అమెరికా సైంటిస్టులు


కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అమెరికా సైంటిస్టులు కరోనాను నివారించడంతోపాటు చికిత్స కోసం ఉపయోగపడే ఓ అణువును కనుగొన్నారు. దీంతో ఔషధం అభివృద్ధి చేసేందుకు తయారవుతున్నారు.

ఈ డ్రగ్‌పై వచ్చే ఏడాది ప్రారంభంలో క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అణువును కనుగొన్నారు. ఇది కరోనా వైరస్‌ సార్స్‌ సీఓవీ--2ను పూర్తిగా తటస్థం చేయగలదని గుర్తించారు. దీనిని ఏబీ8 అని పిలుస్తున్నారు. ఇది కరోనా వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీస్‌ను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే ఎలుకలు, చిట్టెలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీనిని నాసల్‌ స్ప్రే రూపంలో కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు.

ఎఫ్‌డీఏ అనుమతి రాగానే క్లినికల్ ట్రయల్స్‌ మొదలుపెడతామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా శక్తివంతమైనదని, చాలా ప్రభావం చూపిస్తుందన్నారు. ఇది కరోనాను తగ్గించడంతోపాటు రాకుండా కూడా చూస్తుందని పేర్కొన్నారు. దీని ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందని చేతున్నారు.

Tags :

Advertisement