Advertisement

  • అతికొద్ది మంది సమక్షంలో బైడెన్ ప్రమాణస్వీకారం

అతికొద్ది మంది సమక్షంలో బైడెన్ ప్రమాణస్వీకారం

By: Sankar Fri, 18 Dec 2020 11:43 AM

అతికొద్ది మంది సమక్షంలో బైడెన్ ప్రమాణస్వీకారం


జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కోవిడ్‌–19 ముప్పు నేపథ్యంలో నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు.

ఎంపిక చేసిన కొద్దిమంది సమక్షంలోనే అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని జాయింట్‌ కాంగ్రెషనల్‌ కమిటీ ఆన్‌ ఇనాగరల్‌ సెరిమనీస్‌(జేసీసీఐసీ) వెల్లడించింది. పార్లమెంటు సభ్యులు తమతో పాటు మరొక్కరిని మాత్రమే ఈ కార్యక్రమానికి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది..

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రావద్దని, ఇళ్లలోనే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించింది. సాధారణంగా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జేసీసీఐసీ సుమారు 2 లక్షల ఆహ్వాన పత్రాలను పంపిణీ చేస్తుంది. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఈ సారి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు.

Tags :
|
|

Advertisement