Advertisement

  • వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వ ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికన్‌ కంపెనీలు పిటిషన్ దాఖలు

వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వ ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికన్‌ కంపెనీలు పిటిషన్ దాఖలు

By: chandrasekar Thu, 23 July 2020 6:36 PM

వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వ ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికన్‌ కంపెనీలు పిటిషన్ దాఖలు


అమెరికా వ్యాపార సంస్థలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాయి.హెచ్‌1బీ వీసాలతో సహా వర్కింగ్‌ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ పలు అమెరికన్‌ కంపెనీలుపిటిషన్ దాఖలు చేశాయి. అమెరికా హోంశాఖ, విదేశాంగ శాఖలకు వ్యతిరేకంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్‌ కోర్టులో మంగళవారం లాసూట్‌ వేశాయి. అన్ని రకాల వర్కింగ్‌ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ జూన్‌ 22న ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులపై మండిపడుతున్న అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌, నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ తదితర వాణిజ్య సంఘాలు ట్రంప్ యంత్రాంగానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి.

వీసాల నిలిపివేత అమెరికాలో పనిచేసేందుకు వచ్చే వేలాది ప్రొఫెషనల్స్‌పై ప్రభావం చూపుతుందని అమెరికా వ్యాపార సంస్థలు తమ పిటిషన్‌లో ఆరోపించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడంలో ​కీలకమైన ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఐటీ నిపుణులు, డాక్టర్లు, నర్సులు,ఇతర కీలక రంగాల్లో పనిచేసే వారికి ఈ నిబంధనలు వ్యతిరేకమని పేర్కొన్నాయి.అధ్యక్షుడు ట్రంప్‌ తన అధికారాలను అధిగమించి జారీ చేసిన ఉత్తర్వులు పలువురిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు అమెరికా వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక సంఘాలు దాఖలు చేసిన దావాపై ఆ దేశ హోం, విదేశాంగ శాఖలు స్పందించలేదు.

Tags :

Advertisement