Advertisement

  • అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్

అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్

By: Sankar Sun, 08 Nov 2020 07:47 AM

అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చారు. అమెరికా 46 అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైతే, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎంపికయ్యారు.

అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచిన వెంటనే కమలా హ్యారిస్ కొత్త అధ్యక్షుడు జో కు ఫోన్ చేసి మనం సాధించాం... మీరు అధ్యక్షుడు కాబోతున్నారు అని తెలిపింది. జో కు ఫోన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

33 మిలియన్ మందికి పైగా ఈ చిన్న వీడియోను వీక్షించారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ త్వరలోనే ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయబోతున్నారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు.

Tags :

Advertisement