Advertisement

  • ఇండియన్ ప్రైవేట్ విమానాలపై నిషేధం విధించిన అమెరికా

ఇండియన్ ప్రైవేట్ విమానాలపై నిషేధం విధించిన అమెరికా

By: Sankar Tue, 23 June 2020 3:27 PM

ఇండియన్ ప్రైవేట్ విమానాలపై నిషేధం విధించిన అమెరికా



ఇండియా నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలను అమెరికా నిషేధించింది. కరోనా ముసుగులో భారతీయులతో పాటు పబ్లిక్ వ్యక్తులకు టికెట్లు అమ్ముతోందని ఆ దేశ ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంటు ఆరోపించింది. కోవిడ్–19 వల్ల భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా అమెరికాకు ప్రత్యేక విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానాల టికెట్లను పబ్లిక్ కు అక్రమంగా అమ్ముతున్నారని అమెరికా ఆరోపిస్తోంది.

అంతేకాకుండా కోవిడ్ కారణం చూపుతూ అమెరికన్ ఎయిర్ లైన్స్ దేశానికి రావడంపై ఇండియా నిషేధం విధించింది. దీని వల్ల తమ ఎయిర్ లైన్స్ ఆర్థికంగా నష్టపోతున్నాయని అమెరికన్ ట్రాన్స్ పోర్టు డిపార్టు మెంట్ పేర్కొంది. ప్రైవేటు విమానాల రాకపోకలపై నిషేధం 30 రోజుల్లో అమల్లోకి వస్తుందని వెల్లడించింది.ఒకవేళ ప్రైవేటు విమానాలు నడుపుకోవాలనుకుంటే ఇండియా డిపార్టు మెంటు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ పై ఇండియా నిషేధం ఎత్తేసిన తర్వాత తాము తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలిస్తామని తెలిసింది.

Tags :
|
|

Advertisement