Advertisement

ఆ దేశంలో ఒక్కరోజులో లక్ష కరోనా కేసులు ...

By: Sankar Fri, 06 Nov 2020 11:07 AM

ఆ దేశంలో ఒక్కరోజులో లక్ష కరోనా కేసులు ...


అమెరికా ఎన్నికల తరువాత ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నాయి. నవంబర్ 4 వ తేదీన అమెరికాలో ఒక్కరోజులో 99,960 కొత్త కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 5 వ తేదీన అమెరికాలో రికార్డ్ స్థాయిలో 1,03,087 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

అంతేకాదు, ప్రపంచంలో ఒక దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఎక్కడా నమోదు కాలేదు. రాబోయే రోజుల్లో అమెరికాలో ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో అధ్యక్షులు మారినా, కరోనా ప్రభావం ఇప్పటికిప్పుడు ఏ మాత్రం తగ్గదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2020, నవంబర్ 20 నుంచి అమెరికాలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అమెరికా ఆరోగ్యపరంగా ఏ మాత్రం సురక్షితంగా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియాలో 84 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 47,638 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 84,11,724కి చేరింది. ఇందులో 77,65,966 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,20,773 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 670 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,24,985 కి చేరింది


Tags :
|

Advertisement