Advertisement

  • అమెరికాలో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 76,570 కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 76,570 కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Fri, 24 July 2020 6:45 PM

అమెరికాలో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 76,570 కరోనా పాజిటివ్ కేసులు



అమెరికాలో కరోనా ఉదృతి రోజు రోజుకి పెరుగుతూ కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తుంది ..నిపుణులు ముందే చెప్పినట్లు అమెరికాలో ఒక్క రోజు కరోనా కేసులు త్వరలోనే లక్ష దాటే సూచనలు కనిపిస్తున్నాయి . దేశంలో గ‌త 24 గంట‌ల్లో 76,570 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 1225 మంది మ‌ర‌ణించారు.

క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌‌ప్ప‌టి నుంచి ఇంత భారీ సంఖ్య‌లో కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 41 ల‌క్ష‌లు దాటాయి. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 41,69,991 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 1,47,333 మంది మ‌ర‌ణించారు.

అమెరికాలో మొద‌టి క‌రోనా కేసు జ‌న‌వ‌రి 21న న‌మోద‌య్యింది. ఈ సంఖ్య‌ ప‌ది ల‌క్ష‌లకు చేరుకోవ‌డానికి 98 రోజులు ప‌ట్ట‌గా, కేవ‌లం 16 రోజుల వ్య‌వ‌ధిలోనే 30 నుంచి 40 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమెరికాలో గంట‌కు స‌రాస‌రి 2600 పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,56,51,605 పాజ‌టివ్ కేసులు న‌మోద‌వ‌గా, 6,36,464 మంది మ‌ర‌ణించారు. 95,35,213 మంది బాధితులు కోలుకోగా, 54,79,928 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement