Advertisement

చైనా కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్

By: Sankar Sun, 20 Dec 2020 11:22 AM

చైనా కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్


త్వరలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న ట్రంప్ వెళ్లేముందు చైనా కు షాక్ ఇచ్చాడు...స్టాక్ ఎక్స్చేంజీల నుంచి చైనా కంపెనీలను తొలగించే చట్టంపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో అమెరికా ఆడిటింగ్‌ ప్రమాణాలకు కట్టుబడి ఉండకపోతే చైనా కంపెనీలను యూఎస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డిలీట్‌ చేసే అవకాశం ఉంది.

‘ది హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్’ వరుసగా మూడు సంవత్సరాలు యూఎస్‌ పబ్లిక్ అకౌంటింగ్ పర్యవేక్షణ బోర్డు ఆడిట్‌లను పాటించడంలో విఫలమైతే విదేశీ కంపెనీల సెక్యూరిటీలను అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో జాబితా చేయకుండా నిషేధం విధిస్తుంది. ఈ బిల్లు ప్రకారం లిస్టెడ్‌ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది..

అంతేకాకుండా అమెరికాలో పబ్లిక్‌ కంపెనీల ఖాతాలు సమీక్షించే బోర్డు తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తిస్తుంది. అయితే ఆడిటింగ్‌ విషయంలో చైనా కంపెనీలు అమెరికాతో సహకరించకపోవడంతో అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువచ్చింది.

Tags :
|
|
|
|

Advertisement