Advertisement

  • దేశం విడిచి వెళ్లిపోవాల్సివస్తదేమో... డోనాల్డ్ ట్రంప్

దేశం విడిచి వెళ్లిపోవాల్సివస్తదేమో... డోనాల్డ్ ట్రంప్

By: Sankar Sun, 18 Oct 2020 9:03 PM

దేశం విడిచి వెళ్లిపోవాల్సివస్తదేమో... డోనాల్డ్ ట్రంప్

ఎన్నికల్లో ఒకవేళ తాను ఓడిపోతే దేశాన్ని వీడిపోవాల్సి వస్తుందేమోనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సందేహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఫ్లోరిడా, జార్జియా ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించిన ట్రంప్‌ తన ప్రచార తీవ్రతను పెంచారు.

ఈ సందర్భంగా తన డొమెక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. ఆయన గెలిస్తే కమ్యూనిజం, క్రిమినల్ వలసదారుల "వరద" దేశంలోకి ప్రవహిస్తుందని ఆరోపించారు. ఇది అక్కడతో అంతం కాదన్నారు. ‘అధ్యక్ష రాజకీయాల చరిత్రలో చెత్త అభ్యర్థిపై పోటీ చేయడం నాపై ఒత్తిడి తెస్తుంది. నేను ఓడిపోవడాన్ని మీరు ఊహించగలరా? అప్పుడు నేను ఏం చేయాలి?’ అని ట్రంప్‌ ప్రశ్నించారు. ‘ మంచిగా ఉండలేనని, బహుశా నేను దేశం విడిచి వెళ్ళవలసి ఉంటుందేమో.. నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించారు.

బిడెన్ కుటుంబం ఒక క్రిమినల్ సంస్థ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తుండటం, మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో రిపబ్లిక్‌ పార్టీకి కంచుకోటలైన ఫ్లోరిడా, జార్జియాలో తన మద్దతుదారులను కూడగట్టడంపై ట్రంప్‌ దృష్టిసారించారు.

Tags :

Advertisement