Advertisement

  • కరోనా ఉన్నా కూడా రోడ్డు పైకి వచ్చిన ట్రంప్ ...మండిపడుతున్న ప్రజలు

కరోనా ఉన్నా కూడా రోడ్డు పైకి వచ్చిన ట్రంప్ ...మండిపడుతున్న ప్రజలు

By: Sankar Mon, 05 Oct 2020 11:46 AM

కరోనా ఉన్నా కూడా రోడ్డు పైకి వచ్చిన ట్రంప్ ...మండిపడుతున్న ప్రజలు


కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించింది. 40 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు.

వయోభారం కారణంగా ట్రంప్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వాల్టర్ రీట్‌లోని జాతీయ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్‌కు కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆయన ఆక్సిజన్ లెవల్స్ 60 నుంచి 70 శాతానికి పడిపోయాయి. ఇప్పటికే ఆయనకు యాంటీ బాడీస్ మిశ్రమం ఎక్కించారు. రెమ్‌డెసివర్ థెరపీ చేస్తున్నారు. ట్రంప్ ప్రమాదం నుంచి బయటపడలేదని, ఎప్పటికి కోలుకుంటారో చెప్పలేమని డాక్టర్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ..ట్రంప్‌ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. బులెట్‌ ప్రూఫ్‌ కారులో రోడ్డుపై కాసేపు తిరిగారు. కారులో నుంచి తన మద్దతుదారులు, అభిమానులకు అభివాదం చేశారు. తర్వాత తిరిగి ఆస్పత్రిలోకి వెళిపోయారు. అయితే...ట్రంప్‌ తీరుపై పలుగురు మండిపడుతున్నారు. కరోనా నెగిటివ్‌ రాకముందే...ఇలా బయట తిరిగడం బాధ్యత రాహిత్యమని ఫైర్‌ అవుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధ్యక్షుడే ఇలా చేస్తే ఎలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :
|
|

Advertisement