Advertisement

  • అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్న జో బిడెన్

అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్న జో బిడెన్

By: Sankar Sun, 15 Nov 2020 5:24 PM

అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్న జో బిడెన్


అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన ఫలితాలు వెలువడి వారం దాటిపోయింది. కానీ, ఇప్పటి వరకు ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు.

అంతేకాదు, అటు అధికార బదిలీ విషయంలో కీలక పాత్ర పోషించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా అధికార బదిలీపై ఎలాంటి ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంతో జో బైడెన్ ఆ సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్ఏ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన వెంటనే జీఎస్ఏ అధికార ప్రక్రియను మొదలుపెడుతుంది.

అధికార ప్రక్రియ మొదలుపెట్టే ముందు అధికారిక ప్రకటన కూడా చేస్తుంది. కానీ, ఇప్పటి వరకు జీఎస్ఏ నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాకపోవడంపై జో వర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నది. అయితే, ట్రంప్ ఓటమిని ఇంకా అంగీకరించకపోవడంతో జీఎస్ఏ సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం.

Tags :

Advertisement