Advertisement

  • నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను కోల్పోతుంది ..అమెరికాకు విశ్లేషకుల హెచ్చరిక

నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను కోల్పోతుంది ..అమెరికాకు విశ్లేషకుల హెచ్చరిక

By: Sankar Thu, 25 June 2020 10:28 AM

నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను కోల్పోతుంది ..అమెరికాకు విశ్లేషకుల హెచ్చరిక



హెచ్ 1b వీసాలను తాత్కాలికంగా రద్దు చేయడంతో ఎంతో నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుంది అని అమెరికాలోని దిగ్గజ కంపెనీలు ఆందోళనలో ఉన్నాయి ..అయితే కరోనా కారణంగా ఇబ్బందుల్లో ఉన్న అమెరికన్లకు ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వెల్లడించినప్పటికీ , ఈ వీసాల రద్దు వాళ్ళ అమెరికన్లకు ఎటువంటి ఉపయోగం ఉండదు అని అమెరికాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ..మరోవైపు ఇది అమెరికన్ల కంటే చైనీయులకే ఎక్కువ ఉపయోగం అని లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ హెచ్చరించింది.

ట్రంప్‌ నిర్ణయం చైనాకు మాత్రమే ఉపకరిస్తుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ స్పష్టం చేసింది. సింథటిక్‌ ఇంటెలిజెన్స్‌, సెమీకండక్టర్స్‌, బయోటెక్‌ రంగాల్లో చైనా నైపుణ్యాలతో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో వారే పాతుకుపోతారని, అధ్యక్షుడి నిర్ణయంతో హువాయి, బైదు, టెన్సెంట్‌ వంటి డ్రాగన్‌ కంపెనీలకు మేలు చేకూరుతుందని వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇక బహుళజాతి సంస్థలు అమెరికాకు విదేశీ మేనేజర్లను రప్పించే వెసులుబాటు లేకుంటే ఈ ఉద్యోగాలను విదేశాలకే తరలిస్తాయని, అమెరికన్లకు అవకాశాలు అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది.

ఇక హెచ్ 1b వీసాదారులపై ఆధారపడిన వారి భాగస్వాములు అత్యవసరంగా భారత్‌కు వచ్చిన క్రమంలో తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతించాలని అమెరికన్‌ అధికారులను కోరతున్నారు. వీసాల నిలిపివేతపై ట్రంప్‌ ఉత్తర్వులపై విశ్లేషకుల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :
|

Advertisement