Advertisement

  • ఓటమిని అంగీకరించలేకపోతున్న డోనాల్డ్ ట్రంప్...

ఓటమిని అంగీకరించలేకపోతున్న డోనాల్డ్ ట్రంప్...

By: Sankar Mon, 16 Nov 2020 8:59 PM

ఓటమిని అంగీకరించలేకపోతున్న డోనాల్డ్ ట్రంప్...


అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తగిలిన ఎదురు దెబ్బను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించేదే లేదని చెబుతున్న ట్రంప్‌ మరోసారి సోషల్‌ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బైడెన్‌ గెలిచినట్టు అంగీకరిస్తూనే, అధ్యక్ష పీఠంకోసం మోసాలకు పాల్పడుతున్నారంటూ వాపోతున్న ట్రంప్‌ తాజాగా తానే గెలిచానంటూ ట్వీట్‌ చేశారు. 'ఐ వన్ ది ఎలక్షన్' అంటూ సోమవారం ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్‌ చేస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ ట్వీట్‌ను ట్విటర్‌ ఫ్లాగ్ చేసింది. ఈ పోస్ట్ క్రింద ఒక హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.

అటు ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్‌నకు సూచించారు. ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని, ఇకనైనా తన అహాన్ని పక్కన పెట్టి దేశ హితం కోసం బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.

Tags :
|

Advertisement