Advertisement

  • 19 ఏళ్ల కరోనా బాధిత యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం, బాధితురాలు ఆత్మహత్యా యత్నం

19 ఏళ్ల కరోనా బాధిత యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం, బాధితురాలు ఆత్మహత్యా యత్నం

By: chandrasekar Sat, 19 Sept 2020 09:22 AM

19 ఏళ్ల కరోనా బాధిత యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం, బాధితురాలు ఆత్మహత్యా యత్నం


కామంతో కళ్ళుమూసుకుని పోవడంతో అనారోగ్యంతో ఆంబులెన్సు ఎక్కిన యువతిపై అత్యాచారం. 19 ఏళ్ల కరోనా బాధిత యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం బాధితురాలు ఆత్మహత్యా యత్నం చేసింది. కరోనా బారినపడి హాస్పిటల్‌కు వెళ్తుండగా అంబులెన్స్ డ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. తనపై జరిగిన దారుణాన్ని తలచుకొని తీవ్ర మనస్తాపానికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కేరళలోని కొట్టాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలికి చికిత్స అందించి కౌన్సెలింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

కేరళలోని పఠానమిట్ట జిల్లాలో సెప్టెంబర్ 5న కరోనా బారినపడ్డ 19 ఏళ్ల యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించే సమయంలో అంబులెన్స్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఘటన జరిగిన సమయంలో అంబులెన్స్‌లో ఇతర సిబ్బంది ఎవరూ లేకపోవడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాధితురాలు కరోనాకు చికిత్స తీసుకుంటోంది. ఘటన జరిగిన నాటి నుంచి ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆమె తీవ్ర డిప్రెషన్ కి లోనవ్వడంతో ఆత్మహత్య యత్నం చేసింది.

తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని గురువారం మధ్యాహ్నం వాష్‌రూమ్‌లోకి వెళ్లిన యువతి అక్కడ చీరతో సీలింగ్‌కు ఉరి వేసుకుంది. చీర తీసుకొని వాష్‌రూమ్‌కు వెళ్లడాన్ని గమనించిన హాస్పిటల్‌ సిబ్బంది అనుమానంతో ఆమె వెంటే అక్కడికి వెళ్లారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు గుర్తించి వెంటనే రక్షించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ అంబులెన్స్ డ్రైవర్ వి నౌఫాల్ (29)పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 6నే అతడిని అరెస్టు చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అతడిని అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం నుంచి తొలగించారు. పఠానమిట్ట జిల్లా పంథలమ్ ప్రాంతంలో తన బంధువుల ఇంట్లో ఉంటున్న బాధిత యువతికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించుకోగా సెప్టెంబర్ 5న కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది.

వెంటనే అతడిని అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం నుంచి తొలగించారు. పఠానమిట్ట జిల్లా పంథలమ్ ప్రాంతంలో తన బంధువుల ఇంట్లో ఉంటున్న బాధిత యువతికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించుకోగా సెప్టెంబర్ 5న కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆమెను ఐసోలేషన్ కేంద్రానికి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 108 అంబులెన్స్‌ను పంపించారు. అయితే ఆ యువతితో పాటు కరోనా పాజిటివ్ వచ్చిన 42 ఏళ్ల మరో మహిళను కూడా అదే అంబులెన్స్‌లోకి ఎక్కించారు. స్థానిక అదూర్ హాస్పిటల్‌లో పడకలు ఖాళీ లేకపోవడంతో బాధితులిద్దరినీ వేర్వేరు హాస్పిటళ్లకు తరలించడానికి అధికారులు నిర్ణయించారు. యువతిని పెందలమ్ హాస్పిటల్‌లో, 42 ఏళ్ల మహిళను మరో హాస్పిటల్‌లో చేర్పించాల్సిందిగా అంబులెన్స్‌ డ్రైవర్‌ నౌఫాల్‌ (29)కు సూచించారు. బాధితులిద్దరినీ వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి రావడం, పైగా చీకటి పడటంతో అంబులెన్స్ డ్రైవర్ మెదడులో దురాలోచన మొగ్గ తొడిగింది. ఇదే అదనుగా భావించి యువతిపై లైంగిక దాడికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. అంబులెన్స్ ప్రయాణించే మార్గంలో ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్ సెంటర్ తొలుత వస్తుంది. యువతిని అక్కడ వదిలేయాల్సి ఉండగా, దాన్ని దాటుకొని వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ కోజెన్‌చెర్రీ జిల్లా హాస్పిటల్‌లో 42 ఏళ్ల మహిళను దింపేసి వాహనాన్ని తిరిగి వెనక్కి మళ్లించాడు.

కామవాంఛతో ఆ యువతిని ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లో వదిలేస్తానని నమ్మబలికి మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతంలో పార్కు చేసి అంబులెన్స్‌లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఆ కొవిడ్ కేర్ సెంటర్‌లో వదిలేసి వెళ్లాడు. అప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది. బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి అక్కడి ఆరోగ్య సిబ్బందికి చెప్పుకొని కంటతడి పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు అరన్ములా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్‌ నౌఫాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించి కస్టడీలోకి తీసుకొని విచారించారు. నాటి ఘటనపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తీవ్రంగా స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చుట్టుపక్కలవారు కోరుతున్నారు.

Tags :

Advertisement