Advertisement

ప్రకృతితో కలసి జీవీస్తున్న అంబ్రోజ్‌...

By: chandrasekar Tue, 15 Dec 2020 6:06 PM

ప్రకృతితో కలసి జీవీస్తున్న అంబ్రోజ్‌...


మనకు కావాల్సిన బియ్యం, పప్పులు, కూరగాయలు మనమే పండించుకోవడం, మనంవేసుకునే బట్టలు, మనం ఇల్లు మనమే కట్టుకోవడం ఇదే ప్రకృతితో కలసి జీవించడమంటే. కేరళలోని ష్రోనూర్‌‌‌‌కు చెందిన అంబ్రోజ్‌‌కు ప్రకృతితో కలసి జీవించడమంటే ఇష్టం. చిన్నప్పట్నుంచి ప్రకృతితో గడిపేందుకు ఇష్టపడేవాడు.

కొన్నేళ్లకింద స్థానికంగా ‘స్వశ్రయ వైపిన్‌‌’ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభమైంది. మనిషి స్వశక్తిపైనే ఆధారపడి, ప్రకృతికి దగ్గరగా గడపడం ఈ ఉద్యమ లక్ష్యం. దీనిలో పాతికేళ్ల క్రితం అంబ్రోజ్‌‌ పార్టిసిపేట్‌‌ చేసి, ఆర్గానిక్‌‌ గురించి తెలుసుకున్నాడు.

ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నాడు. ఎరువులు వాడకుండా పంటలు పండించడం, వాటికి నేచురల్‌‌ రంగులద్దడం, మట్టి, కలప, సున్నపురాయి వంటి వాటితోనే ఇల్లు కట్టుకోవడం, మట్టితో కుండలు తయారు చేయడం, రాట్నం వడికి కాటన్‌‌ బట్టలు తయారు చేయడం ఇలాంటివన్నీ తనకున్న వ్యవసాయ క్షేత్రంలోనే ‘ఫార్మర్స్‌‌ షేర్‌‌‌‌’ పేరుతో చేస్తున్నాడు‌‌.

‘ఫార్మర్స్‌‌ షేర్‌‌‌‌’ నీలా నది ఒడ్డున, పది ఎకరాల్లో క్యాంపస్‌‌ విస్తరించి ఇందులోనే ఆయన భార్య మినీ ఎలిజబెత్‌‌తోపాటు కొడుకులు అమాల్‌‌, అఖిల్‌‌ కూడా పని చేస్తుంటారు. ఏ అవసరం కోసం బయటివాటిపై ఆధారపడకూడదనేది అంబ్రోజ్‌‌ సిద్ధాంతం. పంటలు పండించడం, పూలు, ఆయుర్వేద మొక్కలు పెంచడం, యానిమల్‌‌ ఫార్మింగ్‌‌, తేనె సేకరణ వంటివన్నీ ఇక్కడ చేస్తుంటారు. ఇక్కడి ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌‌ కూడా చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement