Advertisement

  • తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై సందిగ్థత

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై సందిగ్థత

By: chandrasekar Sat, 22 Aug 2020 7:08 PM

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై సందిగ్థత


కరోనా వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై సందిగ్థత కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడవటం ఇప్పట్లో కష్టంగానే ఉంది. బస్సు సర్వీసుల్ని తిరిగి ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు శనివారం, ఆగస్టు 22న భేటీ కావాల్సి ఉండగా అది కూడా వాయిదా పడింది. రోజు రోజుకి కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో చేసిందే లేక వాయిదా పడుతుంది.

బస్సు సర్వీసులపై ఇంతకుముందు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు జూన్‌లో చర్చలు జరిపారు. ఆ సమయంలో తెలంగాణకు 256 బస్సు సర్వీసులను తిప్పుతామని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. కానీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. మళ్లీ హైదరాబాద్‌లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ హైదరాబాద్‌ బస్ భవన్‌లో కరోనా కేసులు నమోదు కావడం, మరికొన్ని కారణాలతో ఈ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది.

ఈ నెల అన్ లాక్ 3.0 ఆగష్టు 31తో పూర్తి కానుండటంతో వచ్చే వారం తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులు సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సు సర్వీసులు తిప్పాలి ఇటు తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని సర్వీసులు తిప్పాలన్న విషయంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బస్సులు నిలిపివేత వల్ల వ్యాపారస్తులు కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వుంది. అదే సమయం కరోనాను కట్టడి చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ అభిప్రాయపడుచున్నారు.

Tags :
|

Advertisement