Advertisement

  • అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు అక్టోబరు 5 నుంచి

అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు అక్టోబరు 5 నుంచి

By: chandrasekar Fri, 18 Sept 2020 10:10 AM

అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు అక్టోబరు 5 నుంచి


అంబేడ్కర్‌ ఓపెన్‌ యునివర్సిటీ కరోనా కారణంగా ఆలస్యమైన డిగ్రీ పరీక్షల తేదీలను ప్రకటించింది.

డిగ్రీ(సీబీసీఎస్‌) ఆరో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 5-10 తేదీల్లో, ఐదో సెమిస్టర్‌ అక్టోబరు 11-16 తేదీల్లో, మొదటి సెమిస్టర్‌ నవంబరు 7-13 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తామని అధికారులు తెలియచేసారు.

ఇక డిగ్రీ (ఓల్డ్‌ బ్యాచ్‌) పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మూడో సంవత్సరం పరీక్షలను అక్టోబరు 18-23 తేదీల్లో, రెండో సంవత్సరం అక్టోబరు 27 నుంచి నవంబరు 2, మొదటి సంవత్సరం నవంబరు 4-7 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి https://braou.ac.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Tags :
|

Advertisement