Advertisement

అత్యంత ధనవంతుల్లో అంబానీ ఎనిమిదో స్థానం

By: chandrasekar Sat, 11 July 2020 4:57 PM

అత్యంత ధనవంతుల్లో అంబానీ ఎనిమిదో స్థానం


ముకేశ్‌ అంబానీ ఇప్పుడు ఇంకో రికార్డు సృష్టించాడు. ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ తాజాగా మరో ఘనత సాధించాడు. నికర విలువపరంగా ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అధిగమించారు.

2012లో ప్రారంభమైన బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బఫెట్‌ సంపద గురువారానికి 67.9 బిలియన్ డాలర్లుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ 68.3 బిలియన్ల సంపదతో ఆయనను వెనక్కి నెట్టారు.

ఫేస్బుక్ ఇంక్, సిల్వర్ లేక్ వంటి సంస్థల నుంచి బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడంతో అంబానీ షేర్లు మార్చిలో కనిష్టస్థాయి నుంచి రెట్టింపయ్యాయి. ఈ వారం బఫెట్‌ 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు ఇవ్వడంతో ఆయన సంపద తగ్గింది.

గత నెల ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల క్లబ్‌లో ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా అంబానీ నిలిచారు. అంబానీ ఇప్పుడు భూమి మీద నివసిస్తున్నఅత్యంత ధనవంతుల్లో ఎనిమిదో వాడు. బఫెట్‌ తొమ్మిదోస్థానంలో ఉన్నాడు.

Tags :
|
|
|
|

Advertisement