Advertisement

  • అమెజాన్ ప్రైమ్ వీడియో...కొత్త ఫీచర్...వాచ్ పార్టీ...

అమెజాన్ ప్రైమ్ వీడియో...కొత్త ఫీచర్...వాచ్ పార్టీ...

By: chandrasekar Tue, 08 Dec 2020 7:24 PM

అమెజాన్ ప్రైమ్ వీడియో...కొత్త ఫీచర్...వాచ్  పార్టీ...


భారతదేశంలో అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌ గ్రూప్ స్ట్రీమింగ్‌కు ఉపయోగపడే 'వాచ్ పార్టీ' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రైమ్ యూజర్లు ప్లేబ్యాక్ ఆప్షన్‌తో 'వాచ్ పార్టీ'లో పాల్గొనవచ్చు. ఈ ఫీచర్‌ ప్రైమ్ వెబ్ క్లయింట్‌తో మాత్రమే పనిచేస్తుంది. ఒక సింగిల్ వాచ్ పార్టీ సెషన్‌లో 100 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. అమెజాన్ ఈ ఫీచర్‌ను జూలైలోనే అమెరికాలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి మంచి స్పందన రావడంతో ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయాలంటే స్ట్రీమింగ్ సెషన్‌లో పాల్గొనే ప్రతి వ్యక్తికి ప్రైమ్ మెంబర్షిప్ లేదా ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉండాలి.

వాచ్ పార్టీ సెషన్‌ను హోస్ట్‌ చేసే వ్యక్తి మాత్రమే వీడియోను ప్లే, పాస్, స్కిప్ చేయడానికి అవకాశం ఉంది. వర్చువల్ మూవీ సెషన్ ఆన్‌లో ఉన్నప్పుడు వాచ్‌పార్టీ సెషన్‌లో పాల్గొనేవారికి మెస్సేజ్‌లు పంపే ప్రత్యేక చాట్ ట్యాబ్ కూడా ఉంది. ఈ ఫీచర్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ లింక్‌తో మాత్రమే పనిచేస్తుంది. వాచ్ పార్టీ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ప్రైమ్ వీడియో వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత గ్రూప్ స్ట్రీమ్ చేయాలనుకుంటున్న టీవీ షో లేదా సినిమాను ఎంచుకోవాలి. దాంట్లో షేర్ ఆప్షన్ పక్కన ఉండే ‘వాచ్ పార్టీ’ బటన్‌పై క్లిక్ చేసి.. లింక్ కాపీని గ్రూప్ స్ట్రీమింగ్‌లో పాల్గొనేవారికి పంపించాలి. ప్రస్తుతం మన దేశంలో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫీజు నెలకు రూ.129, సంవత్సరానికి రూ.999గా ఉంది. కరోనా మహమ్మారి వల్ల థియేటర్లలో సినిమాలు చూడలేని వారికి ఈ వర్చువల్ ఫీచర్‌ మంచి అనుభూతిని ఇస్తుందని అమెజాన్ అంటోంది.

Tags :
|
|

Advertisement