Advertisement

  • ఇక నుంచి అమెజాన్ లో రైల్ టికెట్లు బుకింగ్ ..కాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా

ఇక నుంచి అమెజాన్ లో రైల్ టికెట్లు బుకింగ్ ..కాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా

By: Sankar Wed, 07 Oct 2020 3:42 PM

ఇక నుంచి అమెజాన్ లో రైల్ టికెట్లు బుకింగ్ ..కాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా


రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అమెజాన్ ఇండియా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇందుకోసం అమెజాన్ బుకింగ్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, ఈ బుకింగ్ ఫీచర్ అమెజాన్ మొబైల్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ త్వరలో ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లో కూడా లభ్యం కానుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

వినియోగదారులు తమ మొదటి టికెట్ బుకింగ్‌లో 10 శాతం క్యాష్‌బ్యాక్ (రూ .100 వరకు) పొందుతారని అమెజాన్ తెలిపింది. ప్రైమ్ సభ్యులు తమ మొదటి బుకింగ్ కోసం 12 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 120 వరకు) పొందవచ్చు. పరిమిత కాలానికి సర్వీస్, పేమెంట్ గేట్‌వే లావాదేవీ ఛార్జీలను కూడా మాఫీ చేసింది.

అయితే అమెజాన్ పే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది విమానం, బస్సు టికెట్ల బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన తాము తాజాగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని అమెజాన్ పే డైరెక్టర్ వికాస్ బన్సాల్ వెల్లడించారు

Tags :
|

Advertisement