Advertisement

  • రాబోయే అయిదు ఏళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పించనున్న అమెజాన్

రాబోయే అయిదు ఏళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పించనున్న అమెజాన్

By: Sankar Wed, 30 Sept 2020 6:31 PM

రాబోయే అయిదు ఏళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పించనున్న అమెజాన్


మరికొద్ది రోజుల్లో దేశంలో అతి పెద్ద పండగలు అయినా దసరా , దీవాలి రాబోతున్నాయి ..దీనితో ఆన్లైన్ సెల్లింగ్ కంపెనీలు అయినా అమెజాన్ , ఫ్లిప్కార్ట్ వంటివి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి..అయితే ఈ పండగ వేళ దేశంలో మరింత విస్తరించేందుకు అమెజాన్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

ఇందుకుగాను వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లక్షమంది సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకున్నట్లు ప్రకటించింది. కాగా వినియోగదారుల డిమాండ్‌ మేరకు డెలీవరీ సిబ్బందిని నియమించుకున్నామని అమెజాన్‌ తెలిపింది. మరోవైపు ప్రత్యక్ష నియమకాలు మాత్రమే కాకుండా పరోక్షంగా ప్యాకేజింగ్ విభాగాలలోకూడా అనేక మందికి ఉపాధి లభించినట్లు పేర్కొంది.

అయితే దేశంలో టెక్నాలజీ, మౌలిక సౌకర్యాలు, లాజిస్టిక్స్ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దేశ కీలక రంగాలలో అనేక పెట్టుబడులు పెట్టనున్నామని, భారీ పెట్టుబడుల నేపథ్యంలో 2025 సంవత్సరం వరకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొంది. అయితే మరో నివేదిక రెడ్‌సీర్‌ ప్రకారం పండగ సీజన్లో కొనుగోళ్లు భారీ స్థాయిలో పెరుగుతామని, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌, గృహ రుణాలు పండగ సీజన్లో భారీ డిమాండ్‌కు అవకాశం ఉందని అభిప్రాయపడింది.

Tags :
|
|

Advertisement