Advertisement

  • ఐపీల్ 2020 టైటిల్ స్పాన్సర్ షిప్ పోటీలో ముందున్న పతంజలి పోటీగా అమెజాన్

ఐపీల్ 2020 టైటిల్ స్పాన్సర్ షిప్ పోటీలో ముందున్న పతంజలి పోటీగా అమెజాన్

By: chandrasekar Tue, 11 Aug 2020 09:59 AM

ఐపీల్  2020 టైటిల్  స్పాన్సర్ షిప్ పోటీలో ముందున్న పతంజలి పోటీగా అమెజాన్


వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానం కోసం భారతీయ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఆ రేసులో పతంజలి సంస్థ ముందంజలో ఉంది. పతంజలి బ్రాండ్ ను విదేశాల్లో విస్తరింపజేసేందుకు ఐపీఎల్ వేదిక అవుతుందనేది సంస్థ ఆలోచనగా ఉంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వతేదీ వరకూ ఐపీఎల్ 2020 యూఏఈ లో జరగనుంది.

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా వాస్తవానికి వివో తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ పలు కారణాలతో ఆ సంస్థ దీని నుంచి తప్పుకుంది. దాంతో ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నా మరీ ముఖ్యంగా భారతీయ కంపెనీ పతంజలి సంస్థ రేసులో ముందంజలో ఉంది.

చాలాకాలంగా విదేశాల్లో సంస్థకు చెందిన ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయాలని పతంజలి ఆలోచనలో ఉంది. బ్రాండ్ ను విదేశాల్లో విస్తరించేందుకు ఐపీఎల్ 2020 వేదికగా మారబోతుంది. త్వరలోనే బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం టెండర్లు దాఖలు చేయనుంది. అమెజాన్, బైజుస్, డ్రీమ్ 11, అన్ అకాడమీ వంటి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రానున్న దసరా, దీపావళి సీజన్ ల కోసం ఈ అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలని అమెజాన్ పట్టుదలగా ఉంది. ఇప్పుడు అమెజాన్ కు పతంజలి సంస్థతో పోటీ ఎదురవుతోంది. ప్రస్తుత కరోనా నేపధ్య ఆర్ధిక పరిస్థితుల్లో ఎవరూ 2 వందల కోట్లకు మించి బిడ్ చేయకపోవచ్చని తెలుస్తోంది.

Tags :
|

Advertisement