Advertisement

ఏకంగా 1,00,000 ఉద్యోగాలను ప్రకటించిన అమెజాన్

By: chandrasekar Tue, 15 Sept 2020 12:34 PM

ఏకంగా 1,00,000 ఉద్యోగాలను ప్రకటించిన అమెజాన్


అమెజాన్ 1,00,000 ఉద్యోగాలను ప్రకటించింది. అమెరికా, కెనెడా మార్కెట్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఫుల్‌ఫిల్‌మెంట్, లాజిస్టిక్స్ నెట్వర్క్‌లో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్స్ ఇవి. అమెజాన్ ఇప్పటికే 33,000 కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగాలను ప్రకటించింది. ఇవి కాకుండా మరో 1,00,000 జాబ్స్ ప్రకటించింది.

ఎంపిక చేసిన నగరాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలకు గంటకు 15 డాలర్ల నుంచి ఇవ్వనుంది. దీంతో పాటు సైన్ ఆన్ బోనస్ 1000 డాలర్లు చెల్లించనుంది. అమెజాన్ ఇన్నొవేటీవ్ కెరీర్ ఛాయిస్ ప్రోగ్రామ్ ద్వారా డిమాండ్ ఉన్న కోర్సులకు 95 శాతం ట్యూషన్ ఫీజు చెల్లించనుంది అమెజాన్.

ఇక ఫుల్ టైమ్ ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. మొదటి రోజు నుంచే హెల్త్, విజన్, డెంటల్ ఇన్స్యూరెన్స్, 20 వారాల వరకు పేరెంటల్ లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి.

మేము ఈ నెలలో కొత్తగా 100 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్, సార్టేషన్ సెంటర్, డెలివరీ స్టేషన్స్ ఓపెన్ చేస్తున్నామని, 1,00,000 మందిని కొత్తగా నియమించుకుంటున్నామని అమెజాన్ వాల్డ్ వైడ్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ పేర్కొన్నారు. వారికి కనీసం గంటకు 15 డాలర్లు చెల్లిస్తామన్నారు.

అంతేకాదు విస్తరణతో పాటు భద్రతపైనా దృష్టిపెట్టామని కొత్త టీమ్ మెంబర్స్‌కు 12,00,000 గంటల సేఫ్టీ ట్రైనింగ్ పూర్తైందని, మరో 500,000 గంటల ట్రైనింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. అమెరికా, కెనెడాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 75 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్, సార్టేషన్ సెంటర్, రీజనల్ ఎయిర్ హబ్, డెలివరీ స్టేషన్స్ ప్రారంభించింది అమెజాన్.

Tags :
|
|

Advertisement