Advertisement

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ వల్ల అలర్జీ లక్షణాలు

By: chandrasekar Thu, 17 Dec 2020 10:19 PM

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ వల్ల అలర్జీ లక్షణాలు


కరోనా వైరస్ కోసం ప్రస్తుతంఫైజర్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల అలర్జీ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలిపారు.అమెరికాలోకరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫైజర్ కంపెనీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఫైజర్ వ్యాక్సిన్ను తీసుకున్న వాలంటీర్ల లో కొందరికి అలర్జీ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు.అమెరికాలోని అలస్కా లో ఒక వ్యక్తికి ఇచ్చినటీక వల్ల అలర్జీ లక్షణాలు కనిపించినట్లు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ అధికారులు తెలియజేశారు.ప్రస్తుతం అలర్జీ లక్షణాలు ఉన్న వ్యక్తులు వైద్య పర్యవేక్షణలో ఈ వ్యాక్సిన్ను తీసుకోవాలని సూచించారు.

ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం అమెరికాతో పాటు బ్రిటన్ లో కూడా తలెత్తినట్లు తెలిసింది.కొందరిలో కొన్ని ఔషధాలు మరియు ఆహార పదార్థాల కలయిక వల్ల తలెత్తేపరిస్థితినిఅనాఫిలాక్సిస్ అని అంటారు.ఇలాంటి వారు ఫైజర్ వ్యాక్సిన్ను తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కానీ ప్రస్తుతం అలస్కా లో ఈ వ్యాక్సిన్ను తీసుకున్నా వ్యక్తికి ఇంతకుముందు అలర్జీలేదని ఇతనికి వైద్యం చేస్తున్న హాస్పిటల్ వైద్యాధికారులుతెలియజేశారు.అలర్జీ అనంతరం ఆ వ్యక్తికి అందించిన చికిత్స వల్ల ప్రస్తుతం ఆ లక్షణాలు తగ్గినట్లు వారు తెలియజేశారు.

Tags :
|

Advertisement